రూ.8998 కే 5G స్మార్ట్‌ఫోన్.. 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP కెమెరా, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్!
రెడ్‌మి నుంచి భారత్ మార్కెట్ లోకి ఇటీవల రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్, రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్ ను (Redmi 14c 5G Smartphone) విడుదల చేసింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
విడుదల సమయంలో ధరలు ఎలా ఉన్నాయి :
భారత్ మార్కెట్‌లో రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉండేది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.10999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999 గా ఉండేది.

అయితే ప్రస్తుతం అమెజాన్ లో ఈ స్మార్ట్‌ఫోన్ ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ ధర తగ్గుతుందని భావించినా.. అంతకంటే ముందుగానే డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది.
రూ.8998 ప్రారంభ ధరకే 5G స్మార్ట్‌ఫోన్ :
అమెజాన్ లో ఈ ఫోన్ 4GB/64GB వేరియంట్ ధర రూ.8998, 4GB/128GB వేరియంట్ ధర రూ.9998, 6GB/128GB ధర రూ.10998 కే అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌లైట్ బ్లూ, స్టార్ గేజ్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
భారీ డిస్‌ప్లే, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ :
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు ఉన్న కెమెరాలు నైట్ మోడ్, పొర్ట్రెయిట్ మోడ్ ను సపోర్టు చేస్తుంది.
18W ఛార్జింగ్ సపోర్టు :
రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్ 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్ ను కలిగి ఉంది. IP52 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.


Click it and Unblock the Notifications








