Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.14999

Redmi 15 5G Smartphone : రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ లో లాంచ్‌ అయింది. బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 7000mAh సిలికాన్‌ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది. మరియు 6.9 అంగుళాల భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ధర సెగ్మెంట్‌లో ఈ రెండు స్పెసిఫికేషన్‌లు ఆకట్టుకొనే అవకాశం ఉంది. గత వారం విడుదల అయిన పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా 6.9 అంగుళాల డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల FHD+ LCD (1080 x 2340 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. 850 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 288Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland ఫ్లిక్కర్‌ ఫ్రీ, Low Blue light, సర్కాడియన్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటుంది.

Redmi 15 5G Smartphone sale date

4 సంవత్సరాల అప్‌డేట్స్‌ :
ఈ రెడ్‌మి ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్‌ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాససెర్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది.

Redmi 15 5G Smartphone sale date

భారీ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 18W రివర్స్‌ వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది. రిటైల్‌ బాక్స్‌లోనే ఛార్జర్‌ను కూడా అందిస్తామని తెలిపింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 23.5 గంటల యూట్యూబ్‌ ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చని చెబుతోంది.

IP64 రేటింగ్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ AI Erase, AI Sky సహా క్లాసిక్ ఫిల్మ్‌ ఫిల్టర్స్‌ను కలిగి ఉంది. మరియు సర్కిల్‌ టూ సెర్చ్‌ సహా ఇతర ఫీచర్‌లతో కూడిన Gemini AI ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Redmi 15 5G Smartphone sale date

భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. మెరుగైన ఆడియో కోసం డాల్బీ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. మరియు IR బ్లాస్టర్‌ ను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్‌, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

ఈ రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది.

Take a Poll

ఆగస్టు 18 నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. షియోమీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్‌ బ్లాక్, శాండీ పర్పుల్‌, ఫ్రాస్టెడ్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 15 5G Smartphone with 7000mAh battery, snapdragon 6s gen 3 chipset launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X