మార్కెట్‌లోకి రిలయన్స్ 4జీ ఫోన్లు

Written By:

రిలయన్స్ నుంచి 4 జీ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఇప్పటిదాకా కంపెనీ ఉద్యోగులకు ఫోన్లను అందిస్తామని చెప్పిన రిలయన్స్ ఇప్పుడు కష్టమర్లకు కూడా 4జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. లైఫ్ (ఎల్‌వైఎఫ్) బ్రాండ్ పేరిట రిలయన్స్ రిటైల్ 4జీ ఫోన్ల విక్రయాలను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో మొదలయ్యే గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియో టెలికం సర్వీసులకు అనువైనవిగా ఈ 3 హ్యాండ్‌సెట్స్‌ను రూపొందించారు. వీటి ధరలు రూ. 15,499 నుంచి రూ. 25,800 దాకా ఉన్నాయి.

Read More: భారత విపణిలో సెల్ఫీ ఫోన్ హల్‌చల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో

రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వివరాల ప్రకారం హై ఎండ్ 4జీ మోడల్ అయిన లైఫ్ ఎర్త్ 1 ధర రూ. 25,800.

13 ఎంపీ, 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు,

ఇందులో 13 ఎంపీ, 2 ఎంపీ డ్యుయల్ రియల్ కెమెరాలు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 32 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది.

లైఫ్ వాటర్ 1 ధర రూ. 17,399 కాగా

ఇక లైఫ్ వాటర్ 1 ధర రూ. 17,399 కాగా వాటర్ 2 రేటు రూ. 15,499. ఈ రెండు మోడల్స్‌లోనూ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఉన్న 1,000 పైగా సెంటర్ల ద్వారా

రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో కూడా లభించే ఈ హ్యాండ్‌సెట్స్‌కి.. దేశవ్యాప్తంగా ఉన్న 1,000 పైగా సెంటర్ల ద్వారా సర్వీసులు అందించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్న రూ. 4,000 కన్నా తక్కువ ఉండే ఫోన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉన్నట్లు వివరించాయి.

ఫ్లేమ్స్ పేరుతో వచ్చే ఫోన్లు ఈ రేటులో

ఫ్లేమ్స్ పేరుతో వచ్చే ఫోన్లు ఈ రేటులో ఉండొచ్చని భావిస్తున్నట్లు శివాలిక్ డిస్ట్రిబ్యూషన్ ఎండీ శోభిత్ గోయల్ పేర్కొన్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Reliance Jio 4G LYF smartphones go on sale
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot