భారత విపణిలో సెల్ఫీ ఫోన్ హల్‌చల్

Written By:

ఎప్పటినుంచో సెల్ఫీ ఎక్సఫర్ట్‌గా ఊరిస్తూ వస్తున్న స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎట్టకేలకు భారత మార్కెట్లోకి రిలీజయింది. సరికొత్త ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది.ఒప్పో ఎఫ్ 1 పేరిట రిలీజయిన ఈ స్మార్ట్‌ఫోన్‌తో అతి తక్కువ వెలుతురులోనూ డబుల్ ప్లాష్ ద్వారా ఫోటోలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా యువతకు నచ్చే ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read More: 21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్మేశారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అప్పో' సరికొత్త ఎఫ్ సిరీస్‌లో భాగంగా

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ 'అప్పో' సరికొత్త ఎఫ్ సిరీస్‌లో భాగంగా భారత్‌లో అడుగుపెడుతున్న తొలిఫోన్ 'అప్పో ఎఫ్‌1'

దీని ధర రూ. 15990

ధర ఎంత ఉంటుందోనని అదిరిపోయిన వారికి తక్కువ బడ్జెట్ లోనే లభించేలా దీన్ని ధర నిర్ణయించారు. దీని ధర రూ. 15990. ఫిబ్రవరి నుంచి మార్కెట్లో లభిస్తోంది.ఇతర దేశాల్లో ఈ ఫోన్ ధర 250 డాలర్లు/229 యూరోలు (సుమారు రూ. 17వేలు)గా ఉంది.

ఈ ఫోన్‌లోని 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

ఈ ఫోన్‌లోని 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. వైడ్‌ ఎఫ్/2.0 లెన్స్, 1/4 అంగుళాల సెన్సర్ తో రానున్న ఈ ఫ్రంట్‌ కెమెరాతో సాండర్డ్‌ 5 మెగాపిక్సెల్ కెమెరా కన్నా మెరుగైన ఫొటోలు తీయవచ్చునని కంపెనీ చెప్తోంది.

తక్కువ లైంటింగ్‌ ఉన్న పరిసరాల్లోనూ

తక్కువ లైంటింగ్‌ ఉన్న పరిసరాల్లోనూ మంచి సెల్ఫీలు దిగడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది.

అప్పో ఎఫ్‌1లో స్క్రీన్‌ ఫ్లాష్ ఫీచర్

అంతేకాకుండా అప్పో ఎఫ్‌1లో స్క్రీన్‌ ఫ్లాష్ ఫీచర్ ఉంది. దీనివల్ల మొత్తం మొబైల్ డిస్‌ప్లే కెమెరా ఫ్లాష్‌లాగా వ్యవహరించి.. చీకటిలోనూ మెరుగైన సెల్ఫీ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఈ ఫోన్ డిజైన్‌ విషయానికొస్తే దీని బాడీ మిశ్రమ లోహంతో

ఇక ఈ ఫోన్ డిజైన్‌ విషయానికొస్తే దీని బాడీ మిశ్రమ లోహంతో రూపొందించారు. ఐదు అంగుళాల డిస్‌ప్లే, దానిపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4తో ఈ మొబైల్ ఫోన్ రూపొందింది.

బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ తో

బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ తో ఉంటుంది. 3 జీబీ ర్యామ్‌, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ అక్టా కోర్ 64-బిట్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది.

128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ ను

డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్‌ ఉన్న ఈ ఫోన్‌లో 16 జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరెజ్ ఉంటుంది. 128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ ను సపోర్ట్ చేస్తుంది.

2500 ఎంఏహెచ్ లైపో బ్యాటరీ

2500 ఎంఏహెచ్ లైపో బ్యాటరీ ,అలాగే 4జీ నెట్‌వర్క్ .

వచ్చే ఏప్రిల్‌లోనూ మరో స్మార్ట్‌ఫోన్‌ ఎఫ్‌1 ప్లస్‌ను

ఇక వచ్చే ఏప్రిల్‌లోనూ మరో స్మార్ట్‌ఫోన్‌ ఎఫ్‌1 ప్లస్‌ను కంపెనీ విడుదల చేయనుంది. దీని ధర 26,990 రూపాయలు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Oppo F1 camera focused smartphone launched in India at Rs 15990
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot