అన్‌లిమిటెడ్ ఫ్రీ డాటాతో మార్కెట్లోకి రిలయన్స్ 4జీ ఫోన్లు

Written By:

రిలయన్స్ నుంచి 4జీ ఫోన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నవారికి ఇది నిజంగా శుభవార్తే..మార్కెట్లోకి 4జీ ఫోన్లు వచ్చేశాయి. గతేడాది ట్రయల్ బేస్ గా మాత్రమే విడుదలయిన ఈ ఫోన్లు ఇప్పుడు పూర్తి స్థాయలో అమ్మకాలకు సిద్ధమయ్యాయి. అన్ని నగరాల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని రిలయన్స్ సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ తో పాటు 90 రోజుల ఉచిత 4జీ డేటాను అందిస్తున్నామని, 4,500 నిమిషాల ఉచిత ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చని వెల్లడించింది. జియో డాట్ కాం వెబ్‌సైట్ లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుని సిమ్‌కార్డు, స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చని తెలిపింది. తొలుత రిలయన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగి నుంచి రిక్వెస్ట్ తెచ్చుకుంటేనే జియో 4జీ సేవలను పొందవచ్చని చెప్పిన రిలయన్స్, ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. 

Read more : రిలయన్స్ 4జీ వీడియో కాలింగ్ ఫోన్ రూ.3,999కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

4 అంగుళాల WVGA 480పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించకునే అవకాశం

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

5 మెగా పిక్సల్ ప్రైమరీ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

1,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, డ్యుయల్ సిమ్, జీపీఎస్).

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్ 4జీ నెట్ వర్క్ పై హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Here Write Reliance Jio begins sale of 4G-enabled Lyf phones offers free unlimited data for 3 months
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot