వాట్సాప్‌కు పోటీగా రిలయన్స్ జియో

Posted By:

భారత్‌లో వాట్సాప్‌కు పోటీగా జియో చాట్ వచ్చేసింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలియన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఈ ఇన్‌స్టెంట్ మెసెజింగ్ యాప్‌ను ఎప్రిల్ 11వ తేదీన విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లను యాప్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు రిలయన్స్ జియో యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌కు పోటీగా రిలయన్స్ జియో

వీడియో చాటింగ్, వాయిస్ కాలింగ్, మెసేజింగ్, ఆడియో నోట్స్, కాన్ఫిరెన్సింగ్, ఇన్‌స్టెంట్ వీడియో, డూడుల్స్, స్టిక్కర్స్, ఎమోషన్స్ వంటి ప్రత్యేక సౌకర్యాలను ఈ యాప్ ఆఫర్ చేస్తోంది. ఈ యాప్ ద్వారా సందేశాలు పంపుకోవటమే కాదు వీడియో చాటింగ్‌తో పాటు వాయిస్ కాలింగ్‌‍ను కూడా ఆస్వాదించవచ్చు. రిలయన్స్ జియో యాప్ ద్వారా ఏ విధమైన డాక్యుమెంట్ నైనా సెండ్ లేదా రిసీవ్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌కు పోటీగా రిలయన్స్ జియో

జియో చాట్ యాప్‌లో న్యూస్ అప్‌డేట్స్‌ను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. వినోదం, ఆటలు ఇంకా సెలబ్రెటీలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇందుకు మీరు చేయవల్సిందల్లా జియో చాట్ చానల్స్‌తో కనెక్ట్ అవటమే. ఈ యాప్ ద్వారా ఒకే సమయంలో 100 మందికి ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. వాట్సాప్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లకు పోటీగా విడుదలైన రిలయన్స్ జియో పట్ల ఇండియన్ యూజర్లు అమితాసక్తిని కనబరుస్తున్నారు.

ఇంకా చదవండి: లగ్జరీ లుక్ అదరహో!

English summary
Reliance jio indian competitor to whatsapp. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting