కేవలం రూ.3వేలకే..అన్‌లిమిటెడ్ డాటాతో 4జీ ఫోన్
టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ రసవత్తర పోటీకి తెరలేపింది. మూడు నెలలపాటు అన్ లిమిటెడ్ డాటా, అలాగే వాయిస్ కాల్స్ అందిస్తూ కేవలం 3 వేలకే మార్కెట్లోకి 4జీ ఫోన్ తీసుకొచ్చింది. తమ లైఫ్ బ్రాండ్ 4 జీ స్మార్ట్ ఫోన్ రేట్లను గణనీయంగా తగ్గించింది. దీంతో ఫ్లేమ్ సీరిస్ ఫోన్లు ఇప్పుడు కేవలం రూ. 3 వేలకే అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్లో ఇప్పుడున్న 4జీ ఫోన్లలో అత్యంత చవకైన ఫోన్లు ఇవే కావడం విశేషం. ఫ్లేమ్ సిరీస్లో మొత్తం నాలుగు మోడళ్లను కంపెనీ ఈ ధరలో విక్రయిస్తోంది. ఇతర మోడళ్ల ధరలనూ కంపెనీ రూ .4 వేల దాకా తగ్గించినట్టు తెలుస్తోంది.అలాగే ఫోన్లపై రెండేళ్ల వారంటీ కూడా ఉంది. ఫ్లేమ్ ప్రత్యేకతలేంటో చూద్దాం.
అన్‌లిమిటెడ్ ఫ్రీ డాటాతో మార్కెట్లోకి రిలయన్స్ 4జీ ఫోన్లు

LYF Flame 4 ప్రత్యేకతలు...
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్,

LYF Flame 4 ప్రత్యేకతలు...
4జీ ఎల్టీ ఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు.

కెమెరా ప్రత్యేకతలు
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు.

ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్, ప్రాసెసర్
ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,

10 ప్రాంతీయ భాషలతో
10 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఏర్పాటు 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 4.5 గంటల టాక్ టైమ్‌ను అందిస్తుంది.

LYF Flame 3 ప్రత్యేకతలు...
4 అంగుళాల WVGA 480పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

LYF Flame 3 ప్రత్యేకతలు...
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించకునే అవకాశం,

LYF Flame 3 ప్రత్యేకతలు...
5 మెగా పిక్సల్ ప్రైమరీ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

LYF Flame 3 ప్రత్యేకతలు...
1,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, డ్యుయల్ సిమ్, జీపీఎస్).

LYF Flame 3 ప్రత్యేకతలు...
VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్ 4జీ నెట్ వర్క్ పై హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








