ఆ ఫోన్లు మరో రెండు రోజులు వెనక్కి

Written By:

ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ ఫోన్లు ఫ్రీడమ్ 251 మరో రెండు రోజులు ఆలస్యంగా రానున్నాయి. జూన్ 28వ తేదీన డెలివరీ చేస్తామని అంతకు ముందు కంపెనీ ప్రకటించిన విషయం విదితమే. అయితే అనివార్య కారణాల వల్ల మరో రెండు రోజులు ఆలస్యమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఆలస్యానికి కారణాలు ఏంటనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ దక్కించుకునేందుకు చాలామందే ఎదురుచూస్తున్నారు. చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ కింద పేరు నమోదు చేసుకున్నారు.

Read more: ఈ ఏడాది మీరు కొనేందుకు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

ఆ ఫోన్లు మరో రెండు రోజులు వెనక్కి

అయితే ఆలస్యంపై పలువురు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ముందుగా జూన్ 28న డెలివరీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మరో రెండు ఆలస్యమవుతుందంటున్నారు. దీంతో రింగింగ్ బెల్స్ కంపెనీపై అనుమానం కలుగుతోంది. రూ.251 ఫోన్ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నాను. మరోసారి మోహిత్ గోయెల్ మాట మార్చరని భావిస్తున్నా'నని హన్స వర్మ పేర్కొంది. మొదటి విడత (2 లక్షల ఫోన్లు డెలివరీ చేస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ మాట నిలుపుకుంటుందో, లేదో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.

కష్టమర్లకు చుక్కలు చూపిస్తున్న ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ యాప్‌‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ సామర్థ్యం 960x540పిక్సల్స్).

ప్రాసెసర్‌

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచారు.

ఆపరేటింగ్ సిస్టం

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

ర్యామ్, ఇంటర్నల్ మెమరీ

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఈ డివైజ్‌లో 1జీబి ర్యామ్‌తో పాటు 8జీబి ఇంటర్నల్ మెమరీని పొందుపరిచారు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకోవచ్చు. ఇవి స్పెక్స్‌తో ప్రస్తుత మార్కెట్లో దొరుకుతున్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 అంతకంటే ఎక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

3జీ నెట్‌వర్క్‌ సపోర్ట్

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Ringing Bells Freedom 251 deliveries from June 30:Here’s what has happened so far
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting