రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

Written By:

251 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ అంటూ సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ ఫ్రీడం 251 ఫోన్ ఇప్పుడు రివ్యూలతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు 70 వేల పోన్లు డెలివరీ అయిన నేపధ్యంలో ఫోన్ తీసుకున్న వారు పాజిటివ్ రివ్యూలను అందిస్తున్నారు. చాలామంది కష్టమర్లు ఈ ఫోన్ చాలాబాగుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి వారిచ్చిన రివ్యూపై మీరూ ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ.250 ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

రింగింగ్ బెల్స్ సంస్థ మార్కెట్లోకి తీసుకు వచ్చిన ప్రపంచపు అతి తక్కువ ధర స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడమ్ 251'కు మంచి సమీక్షలు వస్తున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 70 వేల యూనిట్లను సంస్థ డెలివరీ చేయగా, వీటిని అందుకుని వాడుతున్న వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

ఈ స్మార్ట్ ఫోన్లో 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, అది ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే, ఒకటిన్నర రోజు పాటు ఫోన్ పనిచేస్తోందని రివ్యూదారులు చెబుతున్నారు.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో లాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ఫోనుకు సమీపంలో ఏవైనా విద్యుదయస్కాంత క్షేత్రాలు ఉన్నాయేమో గమనించేందుకు ప్రాగ్జిమిటీ సెన్సర్ ఒకటి ఉంది.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

అన్ లాక్ కోసం పవర్ బటన్ నొక్కాల్సిన అవసరం లేకుండా స్క్రీన్ మీద వేలు పెడితే చాలు.పాస్‌వర్డ్ అడుగుతుంది. బ్రౌజింగ్, వాట్సాప్ కాలింగ్ చక్కగా పనిచేస్తున్నాయని, ఫోన్ వేడెక్కడం లేదని కస్టమర్లు చెబుతున్నారు.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

ఇందులో ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉంది. 4 అంగుళాల డిస్‌ప్లే తో ఫోన్ 6 వేల రూపాయల ఫోన్లకు ధీటుగా సమాధానం ఇస్తుందని రివ్యూదారులు చెబుతున్నారు.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

3.2 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కెమెరాల విషయంలో అసంతృప్తి ఉన్నప్పటికీ రూ. 251తో ఇంత మాత్రం ఫోన్ రావడమే గొప్ప విషయమేనని వారు విశ్లేషిస్తున్నారు.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

ప్రస్తుతం అంతా 13 మెగాపిక్సెళ్ల వెనక కెమెరా, 5 మెగాపిక్సెల్ వరకు ఫ్రంట్ కెమెరాల యుగం నడుస్తుండటంతో.. కెమెరా విషయంలో కొంత అసంతృప్తి తప్పదు. కానీ, ఫోన్ మాత్రం బాగానే పనిచేస్తోంది.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

ఇంకా ఈ ఫోన్ లో 1 జీబీ ర్యామ్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజికి 8 జిబి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

అంతర్గతంగా 8 జీబీ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడంతో మరిన్ని ఫోటోలు దాచుకోవచ్చని వీటిని వాడుతున్న వారు అంటున్నారు.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

అయితే ఇందులో ఓ చమక్కు కూడా కనిపిస్తోంది. బ్యాటరీ లో అయినప్పుడు టెక్స్ట్ సెట్టింగులు ఆటోమేటిగ్గా హిందీలోకి మారిపోతున్నాయి. వాటిని మనం మళ్లీ వెతుక్కుని ఇంగ్లీషులోకి మార్చుకోవాల్సి వస్తోంది.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

బహుశా రాబోయే ఫోన్లలో దీన్ని సరిచేస్తారేమో చూడాలి. మిగిలిన అన్న విషయాలు చూస్తే మాత్రం 251 రూపాయల ధరలో ఈమాత్రం స్మార్ట్ ఫోనురావడం ఎక్కువేనంటున్నారు.

రివ్యూలతో దిగ్గజాలకు షాక్ ఇస్తున్న రూ. 251 ఫోన్లు

ఫ్రీడం ఫోన్లు బయటకొచ్చాయి.అదృష్టం ఎవరికంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Freedom 251 review At Rs 251, Ringing Bells manages to surprise
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot