శాంసంగ్ A9 Proపై రూ.2500 తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్‌లో నేడే సేల్

Written By:

శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ A9 Proని ఇండియాలో నేటి నుండి అమ్మకానికి పెట్టింది. రూ. 2590 తగ్గింపుత ఫ్లిప్‌క్లార్ట్‌లో ఈ ఫోన్ ని విక్రయించనున్నారు. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 32,490గా ఉంటే ఇప్పుడు రూ.29, 900కి దిగి వచ్చింది. ఫోన్ మెటల్ గ్లాస్ బాడీతో ఇట్టే ఆకట్టుకుంటుంది. 4జీ ర్యామ్ తో వచ్చిన ఈ ఫోన్ ఫీర్లరై ఓ స్మార్ట్ లుక్కేయండి.

6జిబి ర్యామ్, హోమ్ బటన్ లేకుండా HTC Ocean Note

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే

6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటక్షన్,

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ TouchWiz యూజర్ ఇంటర్‌ఫేస్ ఆన్ టాప్,

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 258జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

రేర్ ఫేసింగ్ కెమెరా

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/1.9 aperture, ఎల్ఈడి ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేైజేషన్)

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ప్రత్యేకతలు: f/1.9 aperture, వైడ్ యాంగిల్ సపోర్ట్, హెచ్‌డీఆర్ సపోర్ట్, palm సెల్ఫీ, ఫేస్ బ్యూటిఫికేషన్),

బ్యాటరీ బ్యాకప్

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫోన్ బ్యాటరీ సామర్థ్యం సింగిల్ ఫుల్ చార్జ్ పై 22.5 రోజుల స్టాండ్ బై టైమ్‌గా ఉంది. టాక్ టైమ్ వచ్చేసరికి 32.5 గంటలు, వీడియో ప్లే బ్యాక్ టైమ్ వచ్చేసరికి 26 గంటలు. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌లో భాగంగా ఫోన్ మొత్తం బ్యాటరీని 160 నిమిషాల్లో ఫుల్‌గా చార్జ్ చేయవచ్చు. 30 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 32% బ్యాటరీ చార్జ్ అవుతుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్

ఫోన్‌ను వేగవంతంగా యాక్సెస్ చేసుకునేందుకు ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థను డివైస్ హోమ్ బటన్ భాగంలో నిక్షిప్తం చేసారు. అలానే Knox security, స్ర్కీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకంటాయి.

కనెక్టువిటీ ఫీచర్లు

4జీ, వై-ఫై 802.11 a/b/g/n/ac, బ్లుటూత్ వీ4.2, యూఎస్బీ 2.0, ఎన్ఎఫ్‌సీ,ఫోన్ బరువు వచ్చేసరికి 210 గ్రాములు. బ్లాక్, గోల్డ్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung A9 Pro to go on sale on Flipkart tomorrow, price reduced to Rs 29,900 from Rs 32,490 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot