ఆసక్తిరేపుతున్న శాంసంగ్ ప్రకటన

Written By:

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల కథ అందరికీ తెలిసే ఉంటుంది. కంపెనీ ఫోన్లన్నింటినీ రీకాల్ చేసింది కూడా..ఆ ఫోన్లతో శాంసంగ్ కున్న ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారిపోయిన విషయం విదితమే..అయితే ఇప్పుడు ఆ ఫోన్లపై శాంసంగ్ ఆసక్తికర ప్రకటన చేసింది. ఆ ఫోన్లు ఎందుకు పేలిపోయాయో 23వ తేదీన చెబుతామని అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది.

అక్కడ ఐఫోన్ రేట్లు ఎంత తక్కువంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ నెల 23న ప్రకటిస్తామని..

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 ఫోన్లు కాలిపోవడానికి కారణమేమిటో ఈ నెల 23న ప్రకటిస్తామని శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తాజాగా అధికారిక ప్రకటన చేసింది.

లైవ్‌స్ట్రీమింగ్‌

శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో 23న ఈ ప్రకటనను ఇంగ్లిష్‌, చైనీస్‌, కొరియన్‌ భాషల్లో లైవ్‌స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ ఘటనలపై జరిపిన దర్యాప్తు వివరాలను శాంసంగ్‌ మొబైల్స్‌ ప్రెసిడెంట్‌ కో డాంగ్‌ జిన్‌ వెల్లడించనున్నారు.

ఛార్జింగ్‌కి పెట్టిన వెంటనే పేలిపోతున్నాయన్న వార్తలు

శాంసంగ్‌ ఆ మధ్య విడుదల చేసిన గెలాక్సీ నోట్‌ 7 ఫోన్లు ఛార్జింగ్‌కి పెట్టిన వెంటనే పేలిపోతున్నాయన్న వార్తలు రావడంతో పలు చోట్ల వాటి వాడకాన్ని నిషేధించారు.

5 బిలియన్‌ డాలర్ల నష్టం

దాంతో కంపెనీ ఫోన్లను వెనక్కి తీసుకుంది. వినియోగదారులకు వాటి బదులుగా కొత్త ఫోన్లను ఇచ్చింది. ఫోన్‌ బ్యాటరీ తయారీలో చిన్న లోపం వల్లే ఇలా జరిగిందని శాంసంగ్‌ తొలుత పేర్కొంది. ఈ వ్యవహారం శాంసంగ్‌కి 5 బిలియన్‌ డాలర్ల నష్టం కలిగించింది.

లీ జే యాంగ్‌పై అవినీతి ఆరోపణలు

కంపెనీకి చెందిన వైస్‌ ప్రెసిడెంట్‌ లీ జే యాంగ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణాధికారులు ఆయన అరెస్టుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో శాంసంగ్‌ తాజా ప్రకటన ఆసక్తికరంగా మారింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung will officially announce the results of its Galaxy Note 7 investigation this monday read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot