Samsung Galaxy A26 Vs Nothing Phone 3a రూ.25 వేల ధరలో ఈ రెండు ఫోన్‌లలో ఏది బెస్ట్..!
స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు భారత్ పెద్ద మార్కెట్‌గా ఉంది. ఇటీవల కాలంలో మిడ్ రేంజ్‌లో ఎక్కువ ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. మెరుగైన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లతో అందుబాటులో ఉండడంతో యూజర్లు కూడా ఈ ధర సెగ్మెంట్ ఫోన్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జాబితాలో నథింగ్ ఫోన్ 2a, శాంసంగ్ గెలాక్సీ A26 ఫోన్‌లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. రెండు కూడా రూ.25000 ధరలో లాంచ్ అయాయి.
రూ.25000 ధరలో శాంసంగ్ గెలాక్సీ A26 5G, నథింగ్ ఫోన్ 2a 5G స్మార్ట్‌ఫోన్‌లో (Samsung Galaxy A26 Vs Nothing Phone 3a) ఏ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేయాలి. కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ సహా ఇతర ఫీచర్‌ల పరంగా ఏ ఫోన్ బెస్ట్, మరియు ఏ ఫోన్‌ను ఎక్కువ సంవత్సరాల వరకు సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు.

నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ :
నథింగ్ ఫోన్ 3a హ్యాండ్‌సెట్ (Nothing Phone 3a 5G) 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌తో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే Panda గ్లాస్ రక్షణను పొందుతుంది.
నథింగ్ స్మార్ట్‌ఫోన్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా నథింగ్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS, EIS, f/1.88 అపేచర్‌తో 50MP శాంసంగ్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 2x ఆప్టికల్, 30x డిజిటల్ జూమ్, f/2.0 అపేచర్, EIS తో 50MP సోనీ కెమెరా, 8MP సోనీ అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని నథింగ్ చెబుతోంది. ఈ ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, నోటిఫికేషన్ సౌండ్స్, 10 కొత్త రింగ్‌టోన్స్ సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది. 8GB ర్యా్‌మ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ :
గెలాక్సీ A26 5G స్మా్ర్ట్‌ఫోన్ (Samsung Galaxy A26 5G) 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది .
ఈ హ్యాండ్‌సెట్ 5nm Exynos 1380 ప్రాసెసర్ ను కలిగి ఉంది. Mali G68 MP5 GPU చిప్‌సెట్ కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్‌లను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 8GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, మింట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఈ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్లూటూత్ 5.3, వైఫై, NFC, 5G, 4G వంటి ఫీచర్‌లున్నాయి.
* ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు డిస్‌ప్లేలు సుమారుగా ఒకే సైజులో ఉన్నాయి. మరియు నథింగ్ ఫోన్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండగా.. శాంసంగ్ హ్యాండ్‌సెట్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు 5000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే శాంసంగ్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుండగా.. నథింగ్ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ కావాలంటే నథింగ్ వైపు మొగ్గుచూపవచ్చు.
* ఈ రెండు ఫోన్లు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండగా.. నథింగ్ ఫోన్ 50MP+ 50MP + 8MP + 32MP (సెల్ఫీ) కెమెరాలను కలిగి ఉన్నాయి. అదే శాంసంగ్ 50MP + 8MP+ 2MP+ 13MP (సెల్ఫీ) కెమెరాలున్నాయి. కెమెరాలు ప్రాధాన్యత కలిగిన యూజర్లు నథింగ్ ను కొనుగోలు చేయవచ్చు.
* స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ అందుబాటులో ఉండగా.. శాంసంగ్ ఫోన్ Exynos 1380 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అయితే శాంసంగ్ ఏకంగా 6 సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్ అందిస్తుంది. నథింగ్ కేవలం 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మాత్రమే అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌ల ప్రారంభ ధర రూ.24999 గా ఉంది.


Click it and Unblock the Notifications







