Home
Mobile

6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో శాంసంగ్ Galaxy A26 5G.. కేవలం రూ.24,999 నుంచే!

Samsung Galaxy A26 5G: శాంసంగ్ (Samsung) కంపెనీ గెలాక్సీ A సిరీస్‌లో ఒకేసారి నాలుగు కొత్త ఫోన్లు రిలీజ్ చేసింది. గెలాక్సీ A06 5G, A26 5G, A36 5G, ఇంకా A56 5G మోడల్స్‌తో కొనుగోలుదారులకు చాలా ఆప్షన్లు తెచ్చింది. ఇందులో చాలా ఫోన్లు ఇండియాలో అమ్మకానికి కూడా వచ్చేసాయి.

అయితే ఇప్పుడు Galaxy A26 5G మాత్రం చాలా సైలెంట్‌గా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చో లీక్‌స్టర్స్ చెప్పేశారు. ధర లీక్ కావడంతో త్వరలోనే ఇది విడుదల కాబోతోందని వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే ఈ మొబైల్ వెంటనే విడుదలైంది. మరి దీని ధర ఎంత, దీని ఫీచర్లేవో తెలుసుకుందాం.

Samsung Galaxy A26 5G 6 7 inch 120Hz Display  50MP Camera  5000mAh Battery Price Revealed

* శాంసంగ్ గెలాక్సీ A26 5G ధర

శాంసంగ్ గెలాక్సీ A26 5G రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధరను దాదాపు రూ.24,999గా నిర్ణయించారు. అలాగే 8GB RAM + 256GB వెర్షన్ రూ.27,999గా నిర్ణయించారు. బ్లాక్, మింట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే ఇంకా తక్కువ ధరకే వీటిని పొందవచ్చు.

* డిస్‌ప్లే, డిజైన్

గెలాక్సీ A26 5G ఫోన్‌లో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. దీని రిజల్యూషన్ 2340 X 1080 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. డిస్‌ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉంది, గీతలు పడకుండా కాపాడుతుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ స్క్రీన్ లోపలే ఇచ్చారు.

* శక్తివంతమైన పర్ఫార్మెన్స్

ఈ ఫోన్ శాంసంగ్ ఎక్సీనోస్ 1380 ప్రాసెసర్‌తో వస్తోంది. ఇది 5nm టెక్నాలజీతో తయారుచేశారు, అందుకే పర్ఫార్మెన్స్ చాలా సమర్థవంతంగా ఉంటుంది. బ్యాటరీ బాగా ఆదా అవుతుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G68 MP5 GPU ఉంది, గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా ఫోన్ హ్యాంగ్ అవ్వదు.

Take a Poll

ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్ వన్ UI 7తో వస్తుంది. అంతేకాదు ఆరు భారీ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ కూడా వస్తాయి, అంటే చాలా కాలం వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గురించి కొనుగోలుదారులు భయపడాల్సిన అవసరం లేదు. ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంది, IP67 రేటింగ్‌తో వస్తోంది.

* ట్రిపుల్ కెమెరా సెటప్

గెలాక్సీ A26 5G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP, ఆ తర్వాత 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, ఇంకా 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 13MP కెమెరా ఇచ్చారు, వీడియో కాల్స్ మాట్లాడటానికి, మంచి సెల్ఫీలు తీసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

* బ్యాటరీ, ఛార్జింగ్

ఇందులో అందించిన బ్యాటరీ 5000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, చార్జింగ్ కూడా త్వరగా ఎక్కుతుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. 5G, 4G, 3G, 2G నెట్‌వర్క్స్, Wi-Fi 5GHz, బ్లూటూత్ 5.3, NFC, ఇంకా USB టైప్-C పోర్ట్ కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ A26 5G పర్ఫార్మెన్స్, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ అన్నీ కలిపి ఒక మంచి ఫోన్‌గా వస్తోంది. ధర కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A26 5G launched in India launch. Featuring a 6.7-inch AMOLED display, Exynos 1380 processor, triple cameras, and 5000mAh battery, starting at Rs 24,999.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X