శాంసంగ్ నుంచి ఏకంగా 6 సంవత్సరాల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల..!
శాంసంగ్ ఇవాళ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26 హ్యాండ్‌సెట్‌లను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లు ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ 15 OS తోపాటు 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శాంసంగ్ వెల్లడించింది. గెలాక్సీ A36, గెలాక్సీ A26 హ్యాండ్‌సెట్‌లు మిడ్ రేంజ్ ధరలో అందుబాటులోకి వచ్చాయి.
శాంసంగ్ గెలాక్సీ A36 స్మార్ట్‌ఫోన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
గెలాక్సీ A36 స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A36 5G) 6.7 అంగుళాల FHD+ (2340*1080 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7+ రక్షణను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్ వెల్లడించింది.
బ్యాటరీ పరంగా 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను అమర్చింది. ఈ హ్యాండ్‌సెట్ లావెండర్, బ్లాక్, వైట్, లైమ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ గెలాక్సీ A36 5G ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.35000 గా ఉంటుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A26 5G) 6.7 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ Exynos 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కోసం 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని శాంసంగ్ చెబుతోంది.
గెలాక్సీ A26 5G ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాలను అమర్చారు.
ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ పింక్, ఆలివ్, గ్రాఫైట్, లైట్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.26000 గా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








