లాంచింగ్‌కు ముందే లీకయిన శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు

Written By:

2016 మిగిల్చిన చేదు జ్ఙాపకాల నుంచి బయటపడేందుకు శాంసంగ్ కంపెనీ 2017లో సరికొత్త ఫోన్లతో ముందుకు దూసుకువస్తోంది. కంపెనీ ఎంతో సీక్రెట్ గా ఫోన్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కంపెనీకి సంబంధించిన కొత్త ఫోన్లు లీకయ్యాయి. లీకయిన వివరాల ప్రకారం శాంసంగ్ నుంచి గెలాక్సీ ఏ 3, గెలాక్సీ ఏ 5, గెలాక్సీ ఏ 7 లలో ఈ మూడు డివైజ్‌లు రాబోతున్నాయని తెలుస్తోంది. ఐపీ 68 రేటింగ్‌తో రానున్న ఈ ఫోన్లు వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్స్, ఎన్‌ఎఫ్‌సీ లాంటి ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.

బెంగుళూరుకు ఐఫోన్ కంపెనీ, ధరలు భారీగా తగ్గే అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఏ7 2017 మోడల్

లీకయిన వివరాల ప్రకారం రానున్న గెలాక్సీ ఏ7 2017 మోడల్ 5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తో రానున్నట్లు తెలుస్తోంది. ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ తో వస్తోంది.

ర్యామ్

3 జీబీ ర్యామ్ తో పాటు , 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. 16 ఎంపీలతో ఫ్రంట్, రియర్ కెమెరాలతో దుమ్ము రేపనున్నట్లు సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే 3500mAh.

అదనపు ఆకర్షణలు

4G LTE with VoLTE సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ and GPS and a new USB Type-C port ఛార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ అదనపు ఆకర్షణలు. ధర సుమారుగా రూ .28,800గా ఉండే అవకాశం ఉంది.

గెలాక్సీ ఏ5 2017 మోడల్

లీకయిన వివరాల ప్రకారం రానున్న గెలాక్సీ ఏ5 2017 మోడల్ 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే తో పాటు ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ ను కలిగి ఉంది.

ర్యామ్

2 జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, దీనికి కూడా 16 మెగాపిక్సెళ్ల ఫ్రంట్, రియర్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు రూ .25,700 గా ఉండే అవకాశం ఉంది.

గెలాక్సీ ఏ3 2017 మోడల్

గెలాక్సీ ఏ3 2017 మోడల్ విషయానికొస్తే  4.7 అంగుళాల హెచ్? డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే తో పాటు ఆక్టాకోర్ హెక్సినోస్ 7870 ప్రాసెసర్ తో ఫోన్ రానుంది. 2 జీబీ ర్యామ్ అలాగే 16 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.

కౌలాలంపూర్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు

జనవరి 5 వ తేదీన గెలాక్సీ సీరిస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్స్ చేసింది. కౌలాలంపూర్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానాలు పంపేసింది. అయితే ఈలోపే ఈ ఫోన్లకు సంబంధించిన అన్ని ఫీచర్లు లీకయ్యాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Samsung Galaxy A5 (2017), Galaxy A7 (2017) prices leaked ahead of launch; here’s everything we know so far
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot