లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

Written By:

స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో దూసుకుపోతున్న శ్యాంసంగ్ కంపెనీ ఇప్పుడు లీకేజీలతో బెంబేలెత్తిపోతోంది. మార్కెట్లోకి రిలీజ్ చేయాలనుకుంటున్న ఫోన్లు విడుదలకు ముందే ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఇదే సమస్యతో కుదేలైన శ్యాంసంగ్ తాజాగా గెలాక్సీ సీ5, సీ7 ఫోన్ల లీకేజీతో మరింత సందిగ్ధంలో పడింది. లీకేజీ అయిన సమాచారంలో ఆ ఫోన్లకు సంబంధించిన సమస్త సమాచారం లభిస్తోంది. లీకేజీ అయిన సమాచారం ఏంటో మీరే చూడండి.

Read more: టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

రెండు మెటల్ క్లాడ్ సీ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ సీ5, సీ7 లను ఆవిష్కరించేందుకు శ్యామ్ సంగ్ ప్లాన్ చేస్తుందని ఈ కొత్త లీకేజ్ ల సమాచారం తెలుపుతోంది.

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

గెలాక్సీ సీ5 రూ. 16,400, గెలాక్సీ సీ7 రూ.18,500 ఉండబోతుందని సమాచారం. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు డ్యూయల్ సిమ్‌లను సపోర్టు చేస్తుందని, ఆరు నుంచి ఏడు మిల్లీమీటర్ల థింక్ గా పనిచేస్తుందని లీకేజి అయిన సమాచారం తెలుపుతోంది.

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

అంతే కాకుండా ఆల్ట్రా హై క్వాలిటీ ఆడియోతో ఈ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారుల ముందుకు రాబోతున్నాయని, కేవలం ఆన్‌లైన్ లోనే అందుబాటులో ఉంటాయని ఆ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకూ శ్యామ్‌సంగ్ విడుదలచేసిన మొబైల్‌లు ఆన్‌లైన్‌లోనూ, రిటైల్ స్టోర్స్‌లోనూ లభ్యమయ్యేవి.

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కేవలం సైజ్, బ్యాటరీ‌లోనే వేరుగా ఉంటాయని మిగతా ఫీచర్లని ఒకే మాదిరిగా ఉంటాయని తెలుస్తోంది. ఫీచర్స్ కూడా దుమ్ము రేపనున్నాయని తెలుస్తోంది.

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

5.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో గెలాక్సీ సీ5 వస్తోంది. అలాగే  5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో గెలాక్సీ సీ7 వస్తోంది.

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

గెలాక్సీ సీ5 బ్యాటరీ సామర్థ్యం 2,600 ఎంఏహెచ్ అలాగే 
గెలాక్సీ సీ7 బ్యాటరీ సామర్థ్యం 3,300 ఎంఏహెచ్

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

64 బిట్ స్నాప్ డ్రాగన్ 617 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

16 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, సిల్వర్, గోల్డ్, పింక్, గ్రే రంగుల్లో మొబైల్స్ లభ్యమని లీకేజీ సమాచారం తెలుస్తోంది.

లీకేజీలతో బెంబేలెత్తుతున్నశ్యాంసంగ్

ఈ ఫోన్లు ఈ నెల్లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సో ఎంత మాత్రం నిజమనేది శ్యాంసంగ్ నుంచి ప్రకటన వచ్చే వరకు తెలియదు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Samsung Galaxy C5 And C7 Specs, Price And Availability Details Leak Online: What To Expect
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot