రూ.15 వేల ధరలో శాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. 6 సంవత్సరాల అప్‌డేట్స్ సహా కీలక వివరాలు లీక్!
Samsung Galaxy F17 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి ఇటీవల బడ్జెట్ రేంజ్‌లో గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అయితే త్వరలో గెలాక్సీ F17 5G, గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. తాజాగా శాంసంగ్ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్ అయ్యాయి.
ఫుల్ HD+ డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ వివరాలు Smartprix ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుందని తెలుస్తోంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్! :
ఈ గెలాక్సీ F17 5G స్మార్ట్‌ఫోన్ 6nm Exynos 1330 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చని తెలుస్తోంది.
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
5000mAh బ్యాటరీ :
గెలాక్సీ F17 5G హ్యాండ్‌సెట్ 25W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంటుందని తెలుస్తోంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 7.5mm థిక్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఫోన్ కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. సెప్టెంబర్ 4 వ తేదీన ఈ హ్యాండ్‌సెట్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* సెప్టెంబర్ 4 వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 4 వ తేదీ 3PM కు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ట్యాబ్లెట్‌ను ప్రీ ఆర్డర్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.
దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవలే ఈ ఫోన్ ధర సహా ఇతర వివరాలు లీక్ అయ్యాయి. భారత్ మార్కెట్‌లో రూ.60 వేల ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6 లేదా 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications