Home
Mobile

రూ.12999 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, లెదర్‌ ఫినిష్‌తో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల!

Samsung Galaxy F70e 5G Smartphone : శాంసంగ్‌ గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. గెలాక్సీ F70 సిరీస్‌ లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, 6000mAh బ్యాటరీ, లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చినా ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది.

శాంసంగ్‌ గెలాక్సీ F70e 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ (720 x 1600 పిక్సల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 260 ppi పిక్సల్స్‌ డెన్సిటి, 16 మిలియన్‌ కలర్స్‌ను సపోర్టు చేస్తుంది. డిజైన్‌ పరంగానూ ఈ ఫోన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

samsung galaxy F70e 5G

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
గెలాక్సీ F70e 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 6GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ARM Mali G57 GPU ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6,23,000 పాయింట్ల AnTuTu స్కోర్‌ ను కలిగి ఉందని శాంసంగ్‌ చెబుతోంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత One UI 8 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్‌ తెలిపింది. రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

samsung galaxy F70e 5G

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. 50MP ప్రైమరీ, 2MP డెప్త్ సెన్సర్‌లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 25W వైర్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 8.2mm థిక్‌నెస్‌తో 199 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌ ప్యానల్‌ ప్రీమియం లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. Knox Vault, Quick Share వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌ 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ F70e 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.12999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F70e Sale) సేల్‌ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టో్న్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్పాట్‌లైట్‌ బ్లూ, లైమ్‌లైట్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
samsung galaxy F70e 5G smartphone with 6000mAh battery, 50MP camera launched at Rs12999 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X