ఇండియాలోకి సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన సరికొత్త డ్యూయల్ సిమ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ గ్రాండ్’ను మంగళవారం ముంబయ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ర్కీన్ ద్వారా ఢిల్లీలో ప్రదర్శించటం విశేషం. గెలాక్సీ సిరీస్ నుంచి ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్నఈ ఫోన్ ధర రూ.21,500. స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు పై 50జీబి డ్రాప్‌బాక్స్ స్టోరేజ్‌తో పాటు ఉచిత ఫ్లిప్ కవర్‌ను సామ్‌సంగ్ ఇండియా అందిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి గెలాక్సీ గ్రాండ్ రిటైల్ మార్కెట్లో లభ్యంకానుంది.
గెలాక్సీ గ్రాండ్ కీలక స్పెసిఫికేషన్‌లు:
- 5 అంగుళాల మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
- డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
- డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
- 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
- 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
- వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్ డిఎమ్ఐ అవుట్, ఏ-జీపీఎస్, డీఎల్ఎన్ఏ,
- 2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు:
చాట్ ఆన్, గేమ్స్ హబ్, మై మూవీస్, మై మ్యూజిక్, మై మొబైల్ టీవీ, మై స్టేషన్. మై రీడర్, మై ఎడ్యుకేషన్.
ధర ఇతర వివరాలు:
ఎలిగెంట్ వైట్ ఇంకా మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్‌లలో సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ లభ్యం కానుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రిటైల్ మార్కెట్లో విక్రాయాలు ప్రారంభం కానున్నాయి. ధర రూ.21,500.


Click it and Unblock the Notifications








