నిరాడంబరంగా గెలాక్సీ గ్రాండ్ ఆవిష్కరణ!

Posted By: Super

 నిరాడంబరంగా గెలాక్సీ గ్రాండ్ ఆవిష్కరణ!

 

బఫిన్ కోడ్ నేమ్‌తో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ గ్రాండ్’ను సామ్‌సంగ్ వర్గాలు నిరాడంబరంగా ఆవిష్కరించాయి. సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వర్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎస్3 తరహాలో డిజైన్ కాబడిన ఈ

స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రత్యేకమైన ఎస్ ఫీచర్లను కలిగి ఉంది.

నమ్మలేని నిజాలు..!

స్పెసిఫికేషన్‌లు.......

డిస్‌ప్లే: 5 అంగుళాల మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్: డ్యూయల్ కోర్ 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ, ఏ-జీపీఎస్ ఇంకా డీఎల్ఎన్ఏ,

బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది).

ధర ఇతర వివరాలు: ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశ్లేషకులు ఈ డివైజ్ ధరను 800,000 వొన్ ల(రూ. 41,000) నుంచి 100,000 వొన్ (రూ.51,000) మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్‌కు పోటీగా నిలిచిన హెచ్‌టీసీ వన్ ఎస్‌వి స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్,

ఎన్ఎఫ్‌సీ చిప్,

4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఎస్4 ప్రాసెసర్,

1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ),

4జీ ఎల్టీఈ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, వై-పై,

1080ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ధర అంచనా రూ.25,000.

స్కై డ్రైవ్, డ్రాప్ బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌లను ఈ హ్యాండ్‌సెట్ ఉచితంగా అందిస్తోంది. బీట్స్ ఆడియో టెక్నాలజీ సరికొత్త ఆడియో అనుభూతులకులోను చేస్తుంది. పొందుపరిచిన వీడియో పిక్ అలానే బీఎస్ఐ సెన్సార్ వ్యవస్థలు తక్కువ వెళుతురులోనూ ఉత్తమ స్థాయి ఫోటోగ్రఫీని అందిస్తాయి.

ఏది బెస్ట్...?

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ యూజర్ ఎక్ప్‌పీరియన్స్, మన్నికైన బ్యాటరీ బ్యాకప్, ఉత్తమ క్వాలిటీ కెమెరా పనితీరును కోరుకునే వారికి గెలాక్సీ గ్రాండ్ మంచి ఎంపిక. ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఇంకా బీట్స్ ఆడియో టెక్నాలజీని కోరుకునే వారికి హెచ్‌‍టీసీ ఎస్‌వి ఉత్తమ ఎంపిక.

గూగుల్ కార్యాలయాలు (వరల్డ్ వైడ్)!

Read in English

Read more about:
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot