ఉచిత డేటా ఆఫర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు..ధర కూడా తక్కువే
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ప్రపంచ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల రారాజు శాంసంగ్ తన సరికొత్త మొబైళ్లను ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. జే సీరిస్‌లో వస్తున్న ఈ ఫోన్ల ధరలు కూడా బడ్జెట్‌లోనే ఉన్నాయి. గెలాక్సీ జే 7 ప్రైమ్ ధర రూ .18,790 గాను, గెలాక్సీ జే 5 ప్రైమ్ ధర రూ .14,790 గాను నిర్ణయించింది. కాగా నేటి నుంచి అధికారికంగా గెలాక్సీ జే 7 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. గెలాక్సీ జే 5 ప్రైమ్‌ను సెప్టెంబర్ చివరి నుంచి అమ్మకాలు ప్రారంభింస్తామని కంపెనీ తెలిపింది. ఈ రెండు మొబైల్స్ కు సంబంధించిన స్పెషిఫికేషన్స్ కింది విధంగా ఉన్నాయి.
రూ.6 వేల లోపు అదిరే 4జీ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదే

గెలాక్సీ జే 7 ప్రైమ్ డిస్‌ప్లే
5.50 అంగుళాల డిస్‌ప్లే, 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1080x1920 పిక్సెల్ రెజుల్యూషన్

గెలాక్సీ జే 7 ప్రైమ్ ర్యామ్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ విస్తరణ మెమరీ

గెలాక్సీ జే 7 ప్రైమ్ కెమెరా
13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా

గెలాక్సీ జే 7 ప్రైమ్ బ్యాటరీ
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్

గెలాక్సీ జే 7 ప్రైమ్ ధర
ధర రూ .18,790. దీంతో పాటు గెలాక్సీ జే 7 ప్రైమ్‌కు వొడాఫోన్ బండెల్ డేటా ఆఫర్‌ను శాంసంగ్ అందిస్తోంది.

గెలాక్సీ జే 5 ప్రైమ్ డిస్‌ప్లే
5.00 అంగుళాల డిస్‌ప్లే, 1.4 గిగిహెడ్జ్ ప్రాసెసర్, 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్

గెలాక్సీ జే 5 ప్రైమ్ ర్యామ్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ

గెలాక్సీ జే 5 ప్రైమ్ కెమెరా
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

గెలాక్సీ జే 7 ప్రైమ్ బ్యాటరీ
2400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్

గెలాక్సీ జే 5 ధర
గెలాక్సీ జే 5 ధర రూ .14,790. దీంతో పాటు గెలాక్సీ జే 5 ప్రైమ్ కస్టమర్లు 1 జీబీ డేటాకు నగదు చెల్లిస్తే, 9 జీబీ డేటాను మూడు నెలల వరకు ఉచితంగా వాడుకునే ఆఫర్‌ను శాంసంగ్ కల్పిస్తోంది.

అప్‌గ్రేడెడ్
అయితే శాంసంగ్ కంపెనీ గెలాక్సీ జే 7 ప్రైమ్‌ను గెలాక్సీ జే 7 కు అప్‌గ్రేడెడ్‌గా, గెలాక్సీ జే 5 ప్రైమ్ ఫోన్‌ను గెలాక్సీ జే 5 కు అప్‌గ్రేడెడ్‌గా తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








