Home
Mobile

శాంసంగ్‌ నుంచి బడ్జెట్‌ రేంజ్‌ ధరలో రెండు 5G స్మార్ట్‌ఫోన్‌లు.. భారత్‌ మార్కెట్‌లో రేపే విడుదల..!

శాంసంగ్ నుంచి ఇటీవల ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు F06, A06 5G ఫోన్‌లు విడుదల అయ్యాయి. M సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల విడుదల తేదీ వెల్లడయింది. శాంసంగ్ గెలాక్సీ M16 5G, M06 5G స్మార్ట్‌ఫోన్‌లు (Samsung Galaxy M16 Smartphone launch) రేపు మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌ మార్కెట్లో విడుదల కానున్నాయి. అమెజాన్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత సంవత్సరం లాంచ్‌ అయిన M15, M05 మోడళ్లకు తర్వాత తరం వెర్షన్‌గా ఈ హ్యాండ్‌సెట్‌లు విడుదల కానున్నాయని సమాచారం.

గెలాక్సీ M సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు :
శాంసంగ్‌ గెలాక్సీ M16, M06 స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్ స్కెచ్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ఆధారంగా ఈ రెండు ఫోన్‌ల కెమెరా మాడ్యూల్‌ డిజైన్ సహా స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. గెలాక్సీ M16 ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. అదే గెలాక్సీ M06 మోడల్‌ డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఈ రెండు కెమెరా మాడ్యూల్‌లు పిల్‌ ఆకారంలో ఉన్నాయి. మరియు ఫ్లాష్‌ లైట్‌లను కూడా ఈ డిజైన్‌ స్కెచ్ ద్వారా గుర్తించవచ్చు.

Samsung Galaxy M16  Galaxy M06 5G Smartphones

చిప్‌సెట్‌ వివరాలు :
గెలాక్సీ M16 స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియల్‌ స్టాండర్డ్స్‌ (BIS), గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. BIS లో SM-M166P/DS మోడల్ నంబర్‌ను కలిగి ఉంది. అదే గీక్‌బెంచ్‌లో SM-M166P మోడల్‌ నంబర్‌తో కనిపించింది. ఫలితంగా ఈ ఫోన్ 8GB ర్యామ్‌తో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలిసింది.

మరియు ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6 OS ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌ BIS వెబ్‌సైట్‌లో SM-M066B/DS మోడల్‌ నంబర్‌తో (Samsung Galaxy M06 Smartphone launch) కనిపించింది. M16 మోడల్ రూ.15000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా.. M06 మోడల్‌ ఎంట్రీ లెవల్‌ ధరలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

* గత వారం భారత్ మార్కెట్లోకి శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.10000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది.

గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7.0 OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌లను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. బహమా బ్లూ, లిట్‌ వైలెట్‌ వంటి రెండు రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M16, Galaxy M06 5G Smartphones launching tomorrow in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X