Home
Mobile

Samsung Galaxy M21 కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే...

శామ్‌సంగ్ గెలాక్సీ M21 ను ఈ రోజు భారత్‌లో లాంచ్ చేశారు. గతేడాది దేశంలో ప్రారంభమైన గెలాక్సీ M20కి అప్ డేట్ వెర్షన్ గా వస్తున్న ఈ కొత్త శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ మునుపటి మోడల్‌తో పోలిస్తే చాలా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రేడియంట్ బ్యాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్‌ను కలిగి ఉంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M21ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.12,999 లు కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధరను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ఈ రెండు మోడళ్లు మిడ్నైట్ బ్లూ మరియు రావెన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి యొక్క మొదటి సేల్స్ అమెజాన్ ద్వారా మార్చి 23 న మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ (నానో) సిమ్ స్లాట్ గల శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI2.0 తో రన్ అవుతుంది. 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే 1080x2340 పిక్సెల్స్ పరిమాణంలో ఉండి ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 19.5: 9 కారక నిష్పత్తితో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది.

కెమెరా సెట్ -అప్

కెమెరా సెట్ -అప్

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్మార్ట్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ -అప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ఫోటోలను తీయడానికి మరియు వీడియోలను రికార్డ్ చేయడానికి సెటప్ చేయబడి ఉంది. అలాగే 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ యొక్క 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెకండరీ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో మూడవ కెమెరా జతచేయబడి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం దీని ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లతో పనిచేస్తుంది.

బ్యాటరీ

శామ్సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4 G వోల్టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా వస్తుంది. ఫోన్‌లోని ఇతర సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరో, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 6,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 8.9mm మందంతో 188 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M21 Launched in India: Price, Specs, Sales Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X