సామ్‌సంగ్ గెలాక్సి మ్యూజిక్ (దుమ్ములేపే కుర్రకారు కోసం)!

Posted By: Super

సామ్‌సంగ్ గెలాక్సి మ్యూజిక్ (దుమ్ములేపే కుర్రకారు కోసం)!

 

యువతను ప్రధానంగా చేసుకుని మెగాబ్రాండ్ సామ్‌సంగ్  ‘గెలాక్సీ మ్యూజిక్’( Galaxy Music) పేరుతో సరికొత్త మ్యూజిక్ స్మార్ట్‌‍ఫోన్‌ను ఈ డిసెంబర్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోన్ విడుదలకు సంబంధించి ఖచ్చితమైన తేదీ తెలియాల్సింది. ఆండ్రాయిడ్ ఐసీఎస్ ప్లాట్‌ఫామ్‌ను ఈ మ్యూజిక్ మొబైల్‌లో వినియోగించినట్లు  తెలుస్తోంది. ధర రూ.9890.

ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.......

3 అంగుళాల క్వాగా టీఎఫ్టీ డిస్‌ప్లే.

రిసల్యూషన్  240 x 320పిక్సల్స్,

3 మెగా పిక్సల్ కెమెరా,

1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

512ఎంబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, యూఎస్డీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్ ఇంకా హెచ్‌ఎస్‌డిపిఏ.

ప్రత్యేక మ్యూజిక్ వ్యవస్థ:

మ్యూజిక్ ప్రియులకు ఈ డివైజ్ వీనలవిందైన అనుభూతులను అందిస్తుంది. ప్రత్యేక మ్యూజిక్ బటన్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేశారు.  మ్యూజిక్ ప్లేయర్ విత్ సౌండ్ ఎలైవ్, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో విత్ ఆర్‌డిఎస్ ఫీచర్లు ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ వ్యూ, ఫ్రంటల్ స్టీరియో లౌడ్ స్పీకర్, ఎస్ఆర్ఎస్ సౌండ్ ఆడియో ఎఫెక్ట్ వ్యవస్థలు అత్యుత్తమ మ్యూజిక్‌ను చేరువ చేస్తాయి.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధరల తగ్గింపు (టాప్-5)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot