గెలాక్సీ నోట్ 5, హిట్టా..ఫట్టా

Posted By:

దక్షిణ కొరియా ఆండ్రాయిడ్ ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ గురువారం న్యూయార్క్‌లో నిర్వహించిన అన్ ప్యాకుడ్ ఈవెంట్‌‍లో భాగంగా తన గెలాక్సీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ఫాబ్లెట్ యూఎస్ ఇంకా కెనడా మార్కెట్లలో ఆగస్టు 21 నుంచి దొరుకుతుంది. ఇందుకు సంబంధించి ప్రీఆర్డర్లు ఆయా దేశాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యాయి. గెలాక్సీ నోట్ 4కు సెక్ససర్ వర్షన్‌గా వస్తోన్న గెలాక్సీ నోట్ 5 మెటల్ ఇంకా గ్లాస్ కాంభినేషన్‌తో ఆకర్షణీయమైన లుక్‌ను సొంతం చేసుకుంది. సూపర్ అమోల్డ్ స్ర్కీన్, ఎస్-పెన్ స్టైలస్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

Read More: ఆశ్చర్యం.. చేతికి చెవి!

గెలాక్సీ నోట్ 5 స్పెసిఫికేషన్‌లు:

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ (రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 7420 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆఫ్షన్స్ (32జీబి/64జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌‍సంగ్ గెలాక్సీ గెలాక్సీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌లోని ఐదు ఆకట్టుకునే ఫీచర్లతో పాటు ఐదు నిరుత్సాహపరిచే ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్. గెలాక్సీ నోట్ 5లో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్ ద్వారా విజువల్స్‌ను అత్యుత్తమ క్వాలిటీతో ఆస్వాదించవచ్చు.

 

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

బెస్ట్ ఫీచర్

గెలాక్సీ నోట్ 5 వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

 

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గెలాక్సీ నోట్ 5లోని ఎస్ పెన్ స్టైలస్ ఫీచర్‌ను మరింతగా ఆధునీకరించారు. ఈ స్టైలస్ ద్వారా నోట్స్ తీసుకోవటం, ఫోటోలను ఎడిట్ చేసుకోవటం ఇలా రకరకాల పనులకు ఉపయోగించుకోవచ్చు.

 

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

సామ్‌సంగ్ పే పేరుతో సరికొత్త పేమెంట్ చెల్లింపు ఫీచర్‌ను గెలాక్సీ నోట్ 5లో ప్రీలోడ్ చేయటం జరిగింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఆన్ లైన్ చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలను చకాచకా నిర్వహించుకోవచ్చు.

 

గెలాక్సీ నోట్ 5లోని ఆకట్టుకునే అంశాలు

గ్లాస్ ఇంకా మెటల్ బాడీ కలయకతో రూపుదిద్దుకున్న గెలాక్సీ నోట్ 5 ప్రీమియమ్ లుక్ ఇంకా ఫీల్‌తో అదరహో అనిపిస్తుంది.

 

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

నాన్-రిమూవబుల్ బ్యాటరీ

గెలాక్సీ నోట్ 5లో ఏర్పాటు చేసిన బ్యాటరీని బయటకు తీయటం కుదరదు. ఇది నిరుత్సాహ పరిచే అంశమే.

 

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సపోర్ట్ లేదు

గెలాక్సీ నోట్ 5లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ లేదు. దీంతో ఫోన్ లోని మెమరీతోనే సరిపెట్టుకోవాలి. పెంచుకునేందుకు ఆస్కారం లేదు.

 

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లో వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లోపించింది. అనుకోకుండా ఫోన్ నీటిలో పడితే అంతే సంగతులు..?

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

గెలాక్సీ నోట్ 5లో ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్ లోపించింది

 

గెలాక్సీ నోట్ 5లోని నిరుత్సాహపరిచే ఫీచర్లు

ఇటీవల కాలంలో బాగా పాపులరైన యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ ఫీచర్ గెలాక్సీ నోట్ 5లో లోపించటం సామ్‌సంగ్ అభిమానులను నిరుత్సాహపరిచే అంశమే.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 5 Now Official: A Look At Five Hits and Misses. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot