ఎక్సినోస్ 5 సీపీయూతో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3!

Posted By: Staff

ఎక్సినోస్ 5 సీపీయూతో  సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3!

 

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తాజా ప్రాజెక్ట్‌లకు సంబంధించి భారీ అంచనాలు నెలకున్నాయి. గెలాక్సీ నోట్ కుటుంబం నుంచి  గెలాక్సీ నోట్ 2కు అప్‌ గ్రేడెడ్ వర్షన్‌‍గా గెలాక్సీ నోట్3ని సామ్‌సంగ్ ఈ  ఏడాది పరిచయం చేయనుందని  టెక్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా లాస్‌వేగాస్‌లో నిర్వహించిన ‘సీఈఎస్  2013’ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ ‘ఎక్సినోస్ 5 వోక్టా’పేరుతో సరికొత్త చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు… అలా దొరికారు!

ఈ చిప్‌సెట్ ఒకేసారి రెండు క్వాడ్ కోర్ ప్రాసెసర్‌లకు వసతి కల్పించగలదు. వాటిలో ఒక ప్రాసెసర్ అత్యంత డిమాండ్ కలిగిన అప్లికేషన్‌లను హ్యాండిల్ చేస్తుంది. మరొక ప్రాసెసర్ సాధారణ టాస్క్‌లను నిర్వహిస్తుంది. కోబియన్ టైమ్స్ తాజాగా బహిర్గతం చేసిన వివరాల మేరకు ఈ సరికొత్త ఎక్సినోస్ వోక్టా చిప్‌సెట్‌ను రాబోయే గెలాక్సీ నోట్3లో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

నోట్3ని అధికారికంగా  సెప్టంబర్‌లో నిర్వహించే  ‘ఐఎఫ్ఏ 2013’ ఈవెంట్‌లో ఆవిష్కరించే అవకాశముందని కొరియన్ టైమ్స్ సదరు నివేదికల్లో పేర్కొంది. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే..... 6.3 అంగుళాల  1080 పిక్సల్  హైడెఫినిషన్ డిస్‌ప్లే. ఎక్సినోస్ 5 వోక్టా చిప్‌సెట్‌కు సంబంధించి జట్‌టీఈ, హవాయి వంటి ఆసియా మొబైల్ తయారీ బ్రాండ్‌లు సామ్‌సంగ్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot