శామ్‌సంగ్ గెలాక్సీ S10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది... ధర కాస్త ఎక్కువే

|

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గెలాక్సీ S10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసారు. శామ్సంగ్ యొక్క లైట్ స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణలో వస్తున్న రెండవ ఫోన్ ఇది. దీనిని ఈ నెల ప్రారంభంలో CES 2020 కంటే ముందు ఆవిష్కరించబడింది.

 

శామ్సంగ్ గెలాక్సీ S10 లైట్

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇప్పటికే ఇండియాలో గెలాక్సీ నోట్ 10 లైట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ను కొనుగోలు చేయడం కోసం ప్రీ-బుకింగ్స్ జరుగుతున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ గెలాక్సీ S10 ఫ్యామిలీ మాదిరిగానే అన్ని రకాల ఫీచర్స్ లను కలిగి ఉంటుంది. దీని యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Gaganyaan మిషన్ లో హ్యూమనాయిడ్ రోబో.... ఇస్రో సంచలన నిర్ణయంGaganyaan మిషన్ లో హ్యూమనాయిడ్ రోబో.... ఇస్రో సంచలన నిర్ణయం

ధరల వివరాలు
 

ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ S10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్ లో విడుదల అయింది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 39,999 రూపాయలుగా ఉంది. కంపెనీ ప్రస్తుతం దేశంలో 6 జీబీ ర్యామ్ మోడల్‌ను విడుదల చేయలేదు. కొత్త శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రిజం వైట్, ప్రిజం బ్లాక్ మరియు ప్రిజం బ్లూ కలర్ ఆప్షన్లలో అందించనున్నారు.

 

 

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... ఫీచర్స్ ఇవే!!!శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... ఫీచర్స్ ఇవే!!!

ఫ్రీ-బుకింగ్స్

ఫ్రీ-బుకింగ్స్

శామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయదలచిన వారి కోసం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లను ఓపెన్ చేస్తున్నారు.ఫిబ్రవరి 4 నుండి ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్.కామ్ మరియు ప్రధాన ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ తెలిపింది.

ఆఫర్స్

ఆఫర్స్

శామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద గల ఆఫర్ల విషయానికొస్తే శామ్సంగ్ ప్రీ-బుకింగ్ ప్రమోషన్‌లలో భాగంగా వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ను కేవలం రూ.1,999 ధర వద్ద అందిస్తున్నది. కస్టమర్లు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 3,000 రూపాయలు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

 

 

చక్కగా బ్రేక్ ఫాస్ట్ తయారుచేస్తున్న రోబోట్...చక్కగా బ్రేక్ ఫాస్ట్ తయారుచేస్తున్న రోబోట్...

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 యొక్క కంపెనీ ONE UI2.0 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో ఉండి పంచ్-హోల్ డిజైన్‌తో మరియు ఇన్ఫినిటీ-ఓ వస్తుంది. ఇది 8GB RAM తో జతచేయబడిన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC చేత పనిచేస్తుంది. ఇది 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును ఇచ్చే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ బ్యాటరీ రెండు రోజుల వరకు బ్యాక్ అప్ వస్తుంది.

 

 

శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా 2-ఇన్ -1 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్....శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా 2-ఇన్ -1 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్....

కెమెరా

కెమెరా

ఇతర స్పెసిఫికేషన్లలోని కెమెరాల విషయానికి వస్తే గెలాక్సీ S10 లైట్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్ ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో, రెండవది ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ మరియు మూడవది ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. శామ్సంగ్ ప్రకారం ఈ ఫోన్ సూపర్ స్టెడి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కు మద్దతు ఇస్తుంది. ఈ ఫీచర్ సరికొత్తది ఇది సూపర్ స్టెడి OIS స్టిల్ ఇమేజెస్ మరియు వీడియోలతో పనిచేస్తుంది.

 

 

ప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లుప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

కనెక్టివిటీ

కనెక్టివిటీ

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్‌లో 128Gb ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మెమొరిని మరింత 1TB వరకు విస్తరించడానికి అదనంగా మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. సాధారణ కనెక్టివిటీ ఎంపికలు మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తాయి. ఈ ఫోన్ 75.6x162.5x8.1mm కొలతలతో 186 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S10 Lite Launched in India: Price,Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X