శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ విడుదల వివరాలు లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌తోపాటు మిడ్ రేంజ్, ఎంట్రీ లెవల్, బడ్జెజ్ రేంజ్‌లోనూ అనేక ఫోన్‌లను లాంచ్ చేసింది. శాంసంగ్ నుంచి త్వరలో గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్‌ను లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ ఫోన్ లాంచ్ వివరాలు లీక్ అయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S25 Edge Smartphone) అల్ట్రా స్లిమ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా లాంచ్ కానుంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వివరాల ఆధారంగా ఈ ఫోన్ ఏప్రిల్ 2025 లో విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ ఇటీవలే BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ 5.84mm థిక్‌నెస్ మరియు 162 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల 1.5k రిజల్యూషన్ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ ఆప్షన్‌తో 256GB స్టోరేజీ, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. దీంతోపాటు AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 200MP ప్రైమరీ కెమెరా సహా 50MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 3900mAh బ్యాటరీనితో పనిచేస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ టైటానియం ఐసీ బ్లూ, టైటానియం సిల్వర్, టైటానియం జెట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌లో అత్యంత స్లిమ్ డిజైన్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఏప్రిల్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. దీనిపై శాంసంగ్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
Just got an update from the source: Samsung Galaxy S25 Edge is launching in India next month. pic.twitter.com/HEISiBqL1m
— Abhishek Yadav (@yabhishekhd) March 20, 2025
* శాంసంగ్ మార్చి తొలివారంలో గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26 విడుదల అయ్యాయి. ఇటీవల గెలాక్సీ A56, A36 భారత్ మార్కె్ట్‌లో సేల్ ప్రారంభం అయింది. గెలాక్సీ A26 ధర, సేల్ వివరాలు వెల్లడి కాలేదు.
శాంసంగ్ గెలాక్సీ A56 5G :
గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm Exynos 1580 ఆక్టాకోర్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంటుంది. ఆరు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 50MP (OIS) ప్రైమరీ కెమెరా, 12MP, 5MP లెన్స్ సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.41,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.44,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.47,999 గా ఉంది.


Click it and Unblock the Notifications








