Home
Mobile

ఏకంగా రూ.11 వేల డిస్కౌంట్‌.. 50MP OIS కెమెరా, 7 సంవత్సరాల అప్‌డేట్స్‌తో..!

శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ ఇటీవల భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌ ను ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది. మార్చి 11 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ప్రీఆర్డర్‌, తొలిసేల్‌ కోసం ఆకట్టుకొనే ఆఫర్లను ప్రకటించింది.

మరో ఫోన్‌పై డిస్కౌంట్ :
గత సంవత్సరం లాంచ్‌ అయిన గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy S25 FE Smartphone) కూడా డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S25 FE pricedrop

భారత్‌ మార్కెట్‌లో విడుదల సమయంలో గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.59,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.65,999, 8GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.77999 గా ఉండేది.

రూ.11 వేల డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌లో 128GB వేరియంట్ ధర రూ.51399 గా ఉంది. అంటే రూ.8600 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అదే 256GB వేరియంట్ రూ.8099 డిస్కౌంట్‌తో రూ.57900 ధరకు కొనుగోలు చేయవచ్చు. 512GB వేరియంట్‌ను రూ.11200 డిస్కౌంట్‌తో రూ.66700 ధరకు కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ ఆర్మర్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 1.5 మీటర్ల లోతైన స్వచ్చమైన నీటిలో 30 నిమిషాలపాటు ఉంచినా డ్యామేజీ కాదని శాంసంగ్ చెబుతోంది. జెట్‌ బ్లాక్, నేవీ, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Samsung Galaxy S25 FE pricedrop

గెలాక్సీ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1900 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. విజన్‌ బూస్టర్‌ ఫీచర్‌ ఉంది. కార్నింగ్‌ గొరిల్లా విక్టస్‌+ ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 4nm Exynos 2400 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 8 పైన పనిచేస్తోంది. 7 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ జెమిని లైవ్‌, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.

50MP OIS కెమెరా :
ఈ శాంసంగ్‌ ఫోన్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్‌ ఉన్నాయి. 12MP సెల్ఫీ కెమెరా ఉంది. 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 4900mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 FE Smartphone with 7 years of updates gets maximum rs11000 pricecut on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X