శ్యాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్స్ లీకయ్యాయి

Written By:

శ్యాం సంగ్ నుంచి కొత్తగా వస్తున్న ఫోన్లకు సంబంధించిన ఫీచర్స్ లీకయ్యాయి. ఆ కంపెనీ ఉద్యోగే ఈ ఫీచర్స్ ను లీక్ చేయడంతో కంపెనీ ఇప్పుడు డైలమాలో పడింది, అవి ఫిబ్రవరిలో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఇలా ముందే లీక్ కావడంతో అధికారికంగా కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. స్మార్ట్ సిరీస్‌లోని గెలాక్సీ పేరుతో ఇప్పటికే విభిన్న మోడల్స్‌ను రిలీజ్ చేసిన సామ్‌సంగ్ ఓ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. అదే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్. ఈ మోడల్స్ ను గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్ మోడల్స్‌కు అప్‌గ్రేడెడ్‌గా ఆవిష్కరించాలని సామ్‌సంగ్ భావిస్తోంది. ఓ కొరియన్ వెబ్‌సైట్‌లో ఈ మోడళ్లకు సంబంధించిన ఫీచర్లను ఆ లీకు వీరుడు పెట్టాడు. ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్ల వివరాలివి.

Read more: 20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శ్యాం సంగ్ గెలాక్సీ ఎస్7 ఫీచర్స్

5.1 అంగుళాల స్క్రీన్ . 12 మెగాపిక్సెల్ కెమెరా

శ్యాం సంగ్ గెలాక్సీ ఎస్7 ఫీచర్స్

3డి టచ్ డిస్‌ప్లే, 128జిబి వరకూ విస్తరించుకునే సామర్థ్యం

శ్యాం సంగ్ గెలాక్సీ ఎస్7 ఫీచర్స్

రెటీనా స్కానర్, ఫాస్ట్ చార్జింగ్, యుఎస్‌బి

శ్యాం సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫీచర్స్

5.5 అంగుళాల స్క్రీన్, కర్వ్‌డ్ గ్లాస్ ఇన్ బోత్ సైడ్స్

శ్యాం సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫీచర్స్

12 మెగాపిక్సెల్ కెమెరా, డ్యుయల్ పిక్సెల్ ఆటో ప్రొటెక్షన్

ఫోటోలు మనకు కావలిసిన విధంగా

శ్యాం సంగ్ నుంచి రానున్న గెలాక్సీ ఎస్7 అలాగే ఎస్ 7 ఎడ్జ్‌లలో ఫోటోలు మనకు కావలిసిన విధంగా తీసుకోవచ్చు. అంటే తక్కువ లైట్ లోనూ అలాగే ఎక్కువ లైట్ లోనూ తీసుకోవచ్చు. దీనికి సంబంధించి లైటింగ్ కంట్రోల్ బటన్ ను రానున్న ఫోన్లలో ప్రవేశపెట్టినట్లు లీకయిన సమాచారం తెలియజేస్తోంది.

డస్ట్ అండర్ వాటర్ రిసిస్టింట్

దీంతో పాటు డస్ట్ అండర్ వాటర్ రిసిస్టింట్ కూడా ఉంది. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ సదుపాయం కూడా కలదు.

ఈ మొబైల్స్ ను అధికారికంగా

శ్యాం సంగ్ కంపెనీ ఈ మొబైల్స్ ను అధికారికంగా ఫిబ్రవరి 21వ తేదీన ఆవిష్కరించే అవకాశం ఉంది.

అంతకంటే ముందే ఓ కొరియన్ వెబ్‌సైట్‌లో

అయితే అంతకంటే ముందే ఓ కొరియన్ వెబ్‌సైట్‌లో లీకు వీరుడు లీక్ చేయడంతో శ్యాంసంగ్ ఆలోచనలో పడినట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Samsung Galaxy S7, S7 edge features leaked by employee
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot