గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లపై దిమ్మతిరిగే న్యూస్..

Written By:

సౌత్ కొరియా దిగ్గజ మొబైల్‌ మేకర్‌ శాంసంగ్‌ సంస్థకు స్మార్ట్‌ఫోన్ల కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు. శాంసంగ్‌ నోట్‌ 7 పేలుళ్లతో అటు ఆర్థికంగాగానూ, ఇటు నైతికంగానూ శాంసంగ్ బాగా దెబ్బతింది. ఇటీవల లాంచ్‌ చేసిన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు గెలాక్స్‌ 8, గెలాక్సీ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లలో కూడా సమస్యలు తలెత్తినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇవి తరచూ రీస్టార్ట్‌ అవుతున్నాయని అమెరికా, తదితర దేశాల యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

జియో వాడకంపై సరికొత్త నిజాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్‌ 8 దానికదే రిస్టార్ట్‌

ఈ సమస్యపై అనేక గెలాక్సీ ఎస్‌ 8, ఎస్‌ 8 ప్లస్‌ వినియోగదారులు సంస్థ అధికారిక ఫోరమ్‌ను, ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ ఫోరమ్‌ను ఆశ్రయించారు. తన గెలాక్సీ ఎస్‌ 8 దానికదే రిస్టార్ట్‌ అవుతోందనీ, ఇది తప్ప మిగతా అంతా బావుందని కమ్యూనిటీ ఫోరంను ఆశ్రయించిన మొదటి ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.

10 గంటల్లో 7 సార్లు రీస్టార్ట్‌

10 గంటల్లో ఇప్పటికే 7 సార్లు రీస్టార్ట్‌ అయిందని, కెమెరా, శాంసంగ్‌ థీమ్స్‌ ఆప్స్ వాడుతున్నపుడు సడెన్‌గా యాప్‌ ఫ్రీజ్‌ అయ్యి, కొన్ని సెకన్ల తర్వాత స్క్రీన్‌ ఆఫ్ అయిపోతోందని ఫిర్యాదు చేశాడు.

సడన్‌గా ఎస్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై

సడన్‌గా ఎస్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై ఏవేవో దృశ్యాలు కనిపించి (దిగువ భాగంలో) పునఃప్రారంభమవుంతోని మరో యూజర్‌ ఫిర్యాదు. ఇది యాప్‌ ప్రాబ్లమ్‌లా తనకు అనిపించడంలేదనీ తెలిపాడు.

శాంసంగ్‌కు ఫోన్‌ చేస్తే..

అంతేకాదు శాంసంగ్‌కు ఫోన్‌ చేస్తే రీటైలర్‌ తిరిగి ఇచ్చేసి.. కొత్తది రిప్లేస్‌మెంట్‌ అడగమని చెప్పారని పేర్కొన్నాడు. దాదాపు ఎస్‌ 8 ప్లస్‌ విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడం గమనార్హం. అయితే వీటిపై శాంసంగ్‌ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

టర్కీ, యూకే లలో ఇలాంటి ఫిర్యాదులే..

మరోవైపు టర్కీ, యూకే లలో ఇలాంటి ఫిర్యాదులే అందుతున్నాయని శాంసంగ్ మొబైల్‌ నివేదించింది. జర్మనీ టర్కీలలో ఎస్‌8 ప్లస్‌లో సమస్యలు తలెత్తినట్టు నివేదించింది. ఈ డిస్‌ప్లే సమస్యలపై శాంసంగ్‌ పరిశీలిస్తోందని తెలిపింది.

సమస్యను పరిష్కరించే క్రమంలో

ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ వినియోగదారులచే నివేదించబడిన రెడ్‌టింట్‌ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉందని పేర్కొంది. గత వారంలో, దక్షిణ కొరియా వినియోగదారుల కంప్లయింట్లపై బగ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నిస్తోందని తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S8, Galaxy S8+ users are now reporting random restart issue read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot