జియో వాడకంపై సరికొత్త నిజాలు..

Written By:

టెలికం రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే ఎవ్వ‌రూ ఊహించ‌నంత మంది వినియోగ‌దారుల‌ను సొంతం చేసుకున్న జియో... త‌మ సిమ్ కార్డుల‌ను అత్య‌ధికంగా ఏయే ప్రాంతాల్లో వాడుతున్నారో తెలిపింది. రాష్ట్రాల వారీగా జాబితాను విడుదల చేసింది. ఇందులో మనోళ్లే జియోని ఎక్కువగా వాడుతున్నారని జియో తెలిపింది.

జియో 4జీ ఫోన్ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ 90.4 లక్షల మంది జియో ఖాతాదారులతో అగ్రస్థానంలో నిలిచింది.

త‌రువాతి స్థానంలో తమిళనాడు, గుజరాత్

ఆ త‌రువాతి స్థానంలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 80.1 లక్షల మంది వినియోగదారుల చొప్పున జియోను వాడుతున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.

ఈశాన్య భారతంలో అత్య‌ల్పం

జియో యూజ‌ర్ల సంఖ్య ఈశాన్య భారతంలో అత్య‌ల్పంగా ఉంది. అక్క‌డ‌ మొత్తం 90 వేల మంది మాత్రమే జియోను వాడుతున్నారు.

ముంబై నుంచే 50 లక్షల మంది

ఇక‌ మహారాష్ట్ర, ఢిల్లీలో 70.7 లక్షల మంది చొప్పున జియో వినియోగ‌దారులు ఉన్నారు. అయితే, మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై నుంచే 50 లక్షల మంది జియోను వాడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ..

అతిపెద్ద రాష్ట్ర‌మైన‌ ఉత్తరప్రదేశ్‌లో 6.9 మిలియన్ల యూజ‌ర్లు ఉన్న‌ట్లు జియో ప్ర‌తినిధులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 6.1 మిలియన్ల మంది జియో వాడుతున్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Andhra Pradesh, Tamil Nadu emerge as top circles for Reliance Jio with highest userbase read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot