ఫిబ్రవరి 14న.. సామ్‌సంగ్ సీక్రెట్ ఏంటి?

Posted By:

ప్రేమికులకు ఇష్టమైన రోజు ‘వాలంటైన్స్ డే'ను పురస్కరించుకుని సామ్‌సంగ్ ఇండియా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఫిబ్రవరి 14న న్యూఢిల్లీలో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రాలు భారత టెక్ మీడియాకు ఇప్పటికే అందాయి. సామ్‌సంగ్ చేపట్టబోయే ఆవిష్కరణలకు సంబంధించి మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది.

మునుపటి నివేదికలను పరిశీలించినట్లయితే 2013 మొదటి త్రైమాసికానికిగాను 10 స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనున్నట్లు సామ్‌సంగ్ వర్గాలు తెలిపాయి. గతవారం సామ్‌సంగ్ గెలాక్సీ పాప్, గెలాక్స్ ఎక్స్ కవర్2 మోడళ్లలో రెండు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను సామ్‌సంగ్ అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇటీవల కాలంగా దేశీయ మార్కెట్లో చోటుచేసుకున్న సామ్‌సంగ్ ఆవిష్కరణలను పరిశీలించినట్లియితే రూ.12,500 ధర శ్రేణిలో గెలాక్సీ గ్రాండ్ ఫాబ్లెట్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది.

ప్రేమికుల రోజు ‘గిఫ్ట్స్' ఆన్‌లైన్‌లో.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫిబ్రవరి 14న.. సామ్‌సంగ్ సీక్రెట్ ఏంటి?

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ (Samsung Galaxy Young):

3.2 అంగుళాల డిస్‌ప్లే,
రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్,
768ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, బ్లూటూత్ 3.0, ఏ-జీపీఎస్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యూయల్ సిమ్ సపోర్ట్.

 

ఫిబ్రవరి 14న.. సామ్‌సంగ్ సీక్రెట్ ఏంటి?

సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్ (Samsung Galaxy Fame):

3.5 అంగుళాల డిస్‌ప్లే,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్,
వై-ఫై, 3జీ, 2జీ, ఏ-జీపీఎస్,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ),
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యూయల్ సిమ్ సపోర్ట్.

 

ఫిబ్రవరి 14న.. సామ్‌సంగ్ సీక్రెట్ ఏంటి?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్2 (Samsung Galaxy Xcover 2):

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్ 4.0,
వై-ఫై, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మైమరీని పొడిగించుకునే సౌలభ్యత,
1,700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్.

 

ఫిబ్రవరి 14న.. సామ్‌సంగ్ సీక్రెట్ ఏంటి?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ (samsung Galaxy Express):

4.5 అంగుళాల డబ్ల్యూవీజీఏ సూపర్ ఆమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యూయల్- కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0,
వై-ఫై కనెక్టువిటీ,
ఏ-జీపీఎస్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ),
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఫిబ్రవరి 14న.. సామ్‌సంగ్ సీక్రెట్ ఏంటి?

గెలాక్సీ ఎస్3 మినీ (Galaxy S3 Mini):

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడిఫ్లాష్ సౌలభ్యతతో ), వీజీఏ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 4 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot