4జీలో శ్యాం‌సంగ్ దే ఆధిపత్యం

Written By:

సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శ్యాం‌సంగ్ ఇండియాలో 4జీకి సంబంధించి స్మార్ట్ ఫోన్ మార్కెట్ డివైసస్ లలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అన్ని కంపెనీలను తలదన్ని శ్యాం సంగ్ ఇండియాలో తన హవాని కొనసాగిస్తోంది. ఈ విషయం సైబర్ మీడియా రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడయింది. సైబర్ మీడియా రీసెర్చి టాప్ 25 4జీ స్మార్ట్ ఫోన్లపై తన సర్వేని నిర్వహించింది. ఈ సర్వేలో శ్యాం సంగ్ తన దూకుడును ప్రదర్శించింది.మార్కెట్ లో ఏయో ఫోన్లకు డిమాండ్ ఉందో ఓ సారి చూద్దాం.

Read more:అతని ఖాతాలో లక్షల కోట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దాదాపు 30 శాతం వాటా

ఇండియాలో 4జీ మార్కెట్లో శ్యాంసగ్ ఇప్పుడు దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ షేర్ ఫస్ట్ త్రైమాసికంలో 24.5 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది.

మార్కెట్ లో 21.8 శాతం లెనోవా వాటా

ఇక మరో 4జీ దిగ్గజం లెనోవా కూడా ఈ త్రైమాసికంలో లాభాలను అర్జించింది. శ్యాం సంగ్ తరువాత లెనోవా కంపెనీ 21.8 శాతంతో మార్కెట్ లో తన వాటాను కలిగి ఉంది.

షియోమి 17.1 శాతం వాటా

షియోమి కూడా 4జీ మార్కెట్ లో దాదాపు 17.1 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందని రీసెర్చి అధ్యయనంలో తేలింది.

లెనోవా ఏ6000,షియోమి రెడిమి2లదే హవా

అయితే బెస్ట్ 4జీ అమ్మకాలలో మాత్రం శ్యాంసంగ్ కన్నా లెనోవా ఏ6000తో పాటు షియోమి రెడిమి2లు ముందు ఉన్నాయి.ఇవి మార్కెట్లో దుమ్ము దుులుపుతున్నాయి.

6000 నుంచి 1000 మధ్యలో ఉండే స్మార్ట్ ఫోన్లకు గిరాకి

ఇండియా మార్కెట్లో కేవలం 6000 నుంచి 1000 మధ్యలో ఉండే స్మార్ట్ ఫోన్లకు గిరాకి ఉందని రీసెర్చి సంస్థ అధికారులు చెబుతున్నారు.

మైక్రొ మ్యాక్స్

ఇక మరో దిగ్గజ కంపెనీ మైక్రొ మ్యాక్స్ ఫస్ట్ క్వార్టర్ లో 10 శాతం సెకండ్ క్వార్టర్ లో 6 శాతం 4జీ మార్కెట్ లో తన వాటాను కలిగి ఉంది.

సోని క్స్ పీరియా ఎమ్ 4

ఆ తరువాత సోని కంపెనీ 5 శాతం వాటాతో 4జీ మార్కెట్ రేసులో నిలిచింది. ఈ కంపెనీకి సంబంధించి ఎక్స్ పీరియా ఎమ్ 4 అలాగే ఈ 4 మోడల్స్ అమ్మకాలు బాగా పెరిగాయి.

4జీ స్మార్ట్ ఫోన్లు దాదాపు 5.7 బిలియన్ల యూనిట్లకు

త్రైమాసికానికి త్రైమాసికానికి మధ్య 154 శాతం వృద్ధి రేటు సాధించగా ఒక్క ఏప్రిల్ జూన్ నెలలోనే 4జీ స్మార్ట్ ఫోన్లు దాదాపు 5.7 బిలియన్ల యూనిట్లకు చేరుకున్నాయి. ఇక 4జీ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్లపై దాదాపు 97 శాతం మిగులు నమోదయింది. ఫోర్త్ క్వార్టర్ కు 4జీ స్మార్ట్ ఫోన్లు దాదాపు 5 బిలియన్లకు చేరుకుంటాయని అంచనా.

11 మిలియన్ల పైనే

2015 చివరినాటికి 11 మిలియన్ల పైనే స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో రాజ్యమేలుతాయని రీసెర్చి తెలిపింది. మొత్తం మీద 4జీ మార్కెట్ లో అన్ని కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్ ల అమ్మకాలలో పెరుగుదలను నమోదు చేశాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
nalytics firm Cybermedia Research (CMR) on Thursday said that Korean electronics giant Samsung topped 25 brands to lead the 4G LTE devices vertical in the Indian smartphone market in terms of shipments.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot