అతని ఖాతాలో లక్షల కోట్లు

Posted By:

సోషల్ మీడియాలో సంచంలనం సృష్టస్తున్నఫేస్‌బుక్ మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈ సారి ఫేస్‌బుక్ సహా వ్యవస్థాపకులు జుకర్ బర్గ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రపంచంలో అత్యంత యువ సంపన్నులలో జుకర్ బర్గ్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి ఎంతో తెలుసా..దాదాపు 41.60 బిలియన్ల డాలర్లు..అదే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 2.70 లక్షల కోట్లు. ఈ మేరకు వెల్త్ ఎక్స్ జాబితాను వెల్లడించింది. ఇందులో ఫేస్‌బుక్ నుంచి మరో సహా వ్యవస్థాపకులు దస్తిన్ మోస్కోవిట్జ్,ఎడ్వర్డో సావెరిన్‌లు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఇంకా విచిత్రకరమైన విషయం ఏమిటంటే టాప్ 20 యువ సంపన్నుల్లో ఆరుగులు మహిళామణులు ఉన్నారు. అలాగే 25 ఏళ్ల లోపు వారిలో స్నాప్‌చాట్ సీఈఓ ఎవాన్ స్పీగెల్ ఫస్ట్ ప్లేస్ ను ఆక్రమించారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ జాబితాలో మన దేశం నుంచి ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేదు. తొలి 20 మందిలో 11 మంది అమెరికా వారు అలాగే చైనా నుంచి 3గురు,హాంకాంగ్ నుంచి 3గురు,స్విట్జర్లాండ్ నుంచి 3గురు చొప్పున జాబితాలో ఉన్నారు. దీనికి సంబంధించిన జాబితాను ఓ సారి చూసేయండి.

Read more : మోజు .. వీళ్లకు తగ్గింది, వాళ్లకి పెరిగింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సంపద :రూ. 2,70,00 కోట్లు

మార్క్ జుకర్ బర్గ్

ఫేస్ బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరు.తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో సంచలనాలకు తెరలేపారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పిన్న వయస్కుల్లో ఒకరుగా నిలిచారు.

సంపద : రూ. 60,000 కోట్లు

దస్తిన్ మోస్కోవిట్జ్

ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకులు. జుకర్ బర్గ్ తో కలిసి ఫేస్ బుక్ ని ముందుకు తీసుకువెళుతున్నారు.

సంపద : రూ. 38,000 కోట్లు

యంగ్ హ్యాయాన్

34 ఏళ్ల యంగ్ హ్యాయాన్ అతి పెద్ద షేర్ హోల్డింగ్ కంపెనీ అయిన గార్డెన్ హోల్డింగ్ కు వైస్ ఛైర్మెన్.40 సంవత్సరాల మహిళల్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వారిలో 6వ స్థానంలో ఉన్నారు.

సంపద రూ.34,000 కోట్లు

ఎడ్వర్డో సావెరిన్‌

ఫేస్‌బుక్ వ్యవస్థాపకుల్లో ఎడ్వర్డో సావెరిన్‌ కూడా ఉన్నారు..జుకర్ బర్గ్ అలాగే దస్తిన్ మోస్కోవిట్జ్ కలిసి పని చేస్తున్నారు.

సంపదరూ. 32,000 కోట్లు

స్కాట్ డంకన్

అమెరికాకు చెందిన యువ బిజినెస్ మెన్.ఎంతో పాపులర్ అయిన ఎంటర్ ప్రైజెస్ ను నడిపిస్తున్నారు. ఎనర్జీ పైప్ లైన్ ఎంపైర్ వ్యవస్థాపకులుగా ఉన్నారు.

సంపద: రూ. 29,000 కోట్లు

ఎలిజబెత్ ఏ హోమ్స్

టెక్నాలజీ,హెల్తేకేర్ రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న లేడి బిలియనర్. ధేరోనస్ కంపెనీ స్థాపకులు అలాగే ఆ కంపెనీకి సీఈఓ. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసస్కుల్లో ఈమె బిలియనీర్.

నాథన్ బ్లెచారిక్

సంపద రూ.19,000 కోట్లు

ఎయిర్‌బిఎన్‌బి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆపీసర్ గా పని చేస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్నారు

సంపద :రూ. 19,000 కోట్లు

బ్రయాన్ చెస్కీ

ఎయిర్‌బిఎన్‌బి కంపెనీ సీఈఓ. దాదాపు అన్ని దేశాల్లో విస్తరించి ఉంది.

సంపద : రూ. 19,000 కోట్లు

జోయ్ గెబియా

ఎయిర్‌బిఎన్‌బి సహా వ్యవస్థాపకులు. బ్రయాన్ చెస్కీ ,నాథన్ బ్లెచారిక్ లతో కలిసి కంపెనీని ముందుకు నడిపిస్తున్నారు.

సంపద: రూ. 17,000 కోట్లు

ధామస్ పెర్సన్

రీటెయిల్ రంగంలో సంచలనాలతో దూసుకుపోతున్న యువ బిజినెస్ మెన్. హెన్నిస్ అండ్ మారిట్జ్ అధిపతి. ఆ కంపెనీని స్మార్ట్ హెచ్ అండ్ ఎమ్ అని కూడా పిలుస్తారు.

సంపద: 1.9 బిలియన్ల డాలర్లు

ఈవెన్ స్పైజెల్

స్నాప్‌షాట్ క్రియేట్ చేసిన వారిలో ఒకరు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A roll call of billionaires under 35 complied by Wealth-X is dominated by male "technopreneurs" and features more than one college dropout.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting