శాంసంగ్ విశ్వరూపం, మడతపెట్టేలా గెలాక్సీ 10

Written By:

శాంసంగ్..మొన్నటిదాకా స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఏలిన రారాజు. తనకు తాను తిరుగులేదని ప్రకటించుకుని దిగ్గజాలకే వణుకు పుట్టించిన కొరియన్ దిగ్గజం. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్లు శాంసంగ్ పరిస్థితి గెలాక్సీ నోట్ 7 పేళుళ్లతో ఒక్కసారిగా మారిపోయింది. టాప్ లో ఉన్న కంపెనీ పాతాళానికి పడిపోయింది. కోలుకోలేక కష్టమర్ల అభిమానాన్ని చూరగొనలేక అఫ్టకష్టాలు పడుతోంది. అయితే వీటన్నింటికీ ఇప్పుడు తన గెలాక్సి 10తో సమాధానం ఇవ్వబోతోందని సమాచారం.

2022 నాటికి రూ.2, 000 లక్షల కోట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Galaxy X పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

గెలాక్సీ నోట్ 7 పేళుళ్లతో అందరీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న శాంసంగ్ ఇప్పుడు తన కొత్త ఫోన్ తో వారందర్నీ షాక్ కు గురిచేయనున్నట్లు తెలుస్తోంది. Galaxy X పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మెనూ బటన్ ఎడమవైపు

కొత్తగా రానున్న ఈ గెలాక్సీ 10లో వెనుకకు తీసుకెళ్లే బటన్ కుడివైపు, మెనూ బటన్ ఎడమవైపు, హోం బటన్ ఈ రెండింటి మధ్యలో ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేటెంట్ హక్కుల దరఖాస్తు

వచ్చే ఏడాది కంపెనీ ఈ ఫోన్లతో మార్కెట్ లోకి అడుగుపెట్టబోతుందని ఈ మేరకు ఆ సంస్థ కొరియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీసులో పేటెంట్ హక్కుల దరఖాస్తును పూర్తి చేసిందని సమాచారం.

సగానికి మడతవేసుకోగల స్మార్ట్ ఫోన్లను

గెలాక్సీ నోట్ 7 ఫోన్లతోపాటు, వాషింగ్ మెషిన్లూ కూడా పేలిపోవడం లాంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్యాంసంగ్ సగానికి మడతవేసుకోగల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా ఉపశమనం పొందాలని భావిస్తోంది.

2017 లో మార్కెట్ లోకి

చాలా ఏళ్లు డిస్‌ప్లేను మడుచుకోగల ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం శ్యాంసంగ్ ఎంతో శ్రమిస్తున్నదని, చివరకు అది పూర్తయిందని 2017 లో మార్కెట్ లోకి వస్తుందని జీఎస్ఎంఏ ఎరెనా సంస్థ తెలిపింది.

కష్టమర్లను మళ్లీ తనవైపుకు

మడతపెట్టే ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ శాంసంగ్‌ను గట్టెక్కించగలదని కష్టమర్లను మళ్లీ తనవైపుకు తిప్పుకునే నంబర్ వన్ గా మార్కెట్లో నిలవగలదని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung may unveil its first foldable smartphone next year read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting