2022 నాటికి రూ.2, 000 లక్షల కోట్లు

Written By:

బ్లాక్ మనీపై మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్నేరేపుతోంది. నిన్నటిదాకా జియో ఫీవర్ లో మునిగిపోయిన దేశం మొత్తం ఇప్పుడు నల్లధనం నల్లధనం అంటూ కలవరిస్తోంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ నేపథ్యంలో ఇకపై డబ్బులకు కాలం చెల్లిందని ఆన్‌లైన్ పేమెంట్ చెల్లింపులే భవిష్యత్ లో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

పర్స్ , డబ్బుల గురించి మరచిపోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఫోన్ల ద్వారా

నల్లధనం బ్యాన్ అయిన నేపథ్యంలో రానున్న కాలంలో మొబైల్ ఫోన్ల ద్వారా చేసే చెల్లింపుల లావాదేవీల సంఖ్య భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అసోచామ్-ఆర్ఎన్కోస్ అధ్యయనంలో వెల్లడైంది. 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో మొబైల్ చెల్లింపుల సంఖ్య భారీ స్థాయిలో పుంజుకుంటున్నట్టు తెలిపింది.

2022 ఆర్థిక సంవత్సరంనాటికి

2016 ఆర్థిక సంవత్సరంలో ఈ లావాదేవీలు కేవలం 300 కోట్లు మాత్రమే ఉన్నాయుని, 2022 ఆర్థిక సంవత్సరంనాటికి ఇవి వార్షికంగా 90 శాతానికి పై పెరిగి 15.300 కోట్లకు చేరుకునే ఆస్కాం ఉందని పేర్కొంది.

2,000 లక్షల కోట్ల రూపాయలు

మొబైల్ పేమెంట్ లావాదేవీలు 2022 ఆర్థిక సంవత్సరానికి వార్షికంగా 150 శాతానికి పైగా సగటు వృద్ధి చెంది 2,000 లక్షల కోట్ల రూపాయలు దాటవచ్చని అసోచామ్ 'ఇండియన్ ఎం-వాలెట్ మార్కెట్' అధ్యయనం అంచనా వేస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్ పేమెంట్ మా ర్కెట్లో

భారత మొబైల్ పేమెంట్ మా ర్కెట్లో మొబైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ వాటాయే 49 శాతంగా ఉంది. 2016 ఆర్థిక సంవత్సరంలో మొబై ల్ ఫోన్ల ద్వారా 38.6 కోట్ల లావాదేవీలు జరగ్గా వీటి విలువ 4 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.

2016 సంవత్సరంలో

2016 సంవత్సరంలో ఈ లావాదేవీల విలువ 8 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. కాగా 2014 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ పేమెంట్ మార్కెట్లో మొబైల్ బ్యాంకింగ్ వాటా కేవలం ఎనిమిది శాతం ఉండేది. 2016 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 49 శాతానికి ఎగబాకింది.

డిజిటల్ పేమెంట్ రంగం

రానున్న కాలంలో డిజిటల్ పేమెంట్ రంగం భారీ స్థాయిలో వృద్ధి చెందే ఆస్కారం ఉందని, ఫలితంగా సాంప్రదాయ కార్డులు, నగదు స్థానాలను ఇది ఆక్రమించే అవకాశం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు.

వంద కోట్లకు పైగా మొబైల్ సబ్స్ర్కైబర్లు

దేశంలో వంద కోట్లకు పైగా మొబైల్ సబ్స్ర్కైబర్లు ఉన్నారని, దీని ఫలితంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు. దీని ఫలితంగా చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు మొబైల్ ద్వారా జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు.

ముందు ముందు డిజిటల్ విప్లవం

ఇదే జరిగితే ముందు ముందు డిజిటల్ విప్లవం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు టెక్ విశ్లేషకులు. డబ్బులతో పనిలేకుండానే అంతా ఆన్ లైన్ మయం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mobile payment transaction volume to reach Rs153 billion by FY22: Assocham Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot