శాంసంగ్ నుంచి మరో సంచలన ఫోన్

Written By:

శాంసంగ్ నుంచి మరో సంచలన ఫోన్ రానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఫ్లిప్ ఫోన్లు మళ్లీ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సంచలన న్యూస్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

యుఎస్‌బి సపోర్ట్‌తో రూ. 5 వేలకే 2జిబి ర్యామ్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్‌ కంపెనీ మళ్లీ ఫ్లిప్‌ తరహా ఫోన్లను

తాజాగా విన్పిస్తున్న ఓ ఆసక్తికర సమాచారం టెక్‌ ప్రియులను ఆకర్షిస్తోంది. శాంసంగ్‌ కంపెనీ మళ్లీ ఫ్లిప్‌ తరహా ఫోన్లను రూపొందిస్తోందట.

డబ్ల్యూ 2017 పేరుతో

డబ్ల్యూ 2017 పేరుతో వ్యవహరిస్తున్న ఈ మోడల్‌ అతి త్వరలో చైనాలో విడుదల చేయబోతున్నారు.

అత్యాధునిక ఫీచర్లతో

అత్యాధునిక ఫీచర్లతో రూపొందుతున్న ఈ మొబైల్‌ను అనంతరం దక్షిణ కొరియాలోనూ విడుదల చేస్తారని సమాచారం.

4 జీబీ ర్యామ్‌

4.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ, 12 ఎంపీ రేర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

4కే క్వాలిటీతో

4కే క్వాలిటీతో వీడియోలను రికార్డ్‌ చేయొచ్చు. అంతేకాదు వేగవంతమైన ఛార్జింగ్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, శాంసంగ్‌ పే వంటి అదనపు సౌకర్యాలను సైతం పొందుపర్చారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung rumored to release a high-end flip phone with dual displays read moreat gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting