యుఎస్‌బి సపోర్ట్‌తో రూ. 5 వేలకే 2జిబి ర్యామ్ ఫోన్

Written By:

జపనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ సాన్‌సుయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హారిజన్‌-2 పేరుతో లాంచ్‌ చేసిన ఈ డివైస్‌ అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్‌ ఫీచర్‌తో పాటు పెన్‌డ్రైవ్‌లు ,ఇతర యూఎస్‌బీ ఆధారిత ఉపకరణాలకు ఇది సపోర్టు చేయనుంది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

నార్త్ కొరియాలో ఏం జరుగుతోంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

5 ఇంచ్ డిస్ ప్లేతో వచ్చిన ఈ ఫోన్ 720x1280 pixels రిజల్యూషన్ తో రానుంది. 1.2 గిగిహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్ మీద ఆపరేట్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 2జిబి ర్యామ్ తో పాటు 16జీబీ ఇంటర్నెనల్‌ స్టోరేజ్‌ ని వాడుకోవచ్చు. మైక్రో ఎస్ డీ ద్వారా 64 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ రియర్‌ కెమెరాతో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

ధర

రూ.4,999 ధరలో ట్యాగ్ అవుతున్న ఈ ఫోన్ మే 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతుంది. ఈ ఫోన్ కి మీరు యూఎస్‌బీ, యూఎస్‌బీ డైరక్ట్ గా పెట్టుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌7.0

ఆండ్రాయిడ్‌7.0 ఆపరేటింగ్‌ సిస్టం మీద రన్ అవుతుంది. పానిక్ బటన్ తోపాటు, పిక్చర్‌ క్వాలిటీకోసం మిరా విజన్‌ ఫీచర్‌ తో బ్లాక్ గ్రే మరియు రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్ లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుందని సాన్‌సుయి సీవోవో అభిషేక్ మల్పని ఒక ప్రకటనలో తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sansui launches 4G VoLTE enabled Horizon 2 with Android 7, IR blaster feature at Rs 4,999 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot