సామ్‌సంగ్ నుంచి త్వరలో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!

By Super
|
Samsung to launch Galaxy Young Duos, Galaxy Frame at MWC 2013


నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ ప్రపంచం కొత్త ఆవిష్కరణలకు ముస్తాబవుతోంది. ముఖ్యంగా బార్సిలోనా పట్టణంలో జనవరి 8 నుంచి ప్రారంభమమయ్యే ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎగ్గిబిషన్’ పై టెక్ ప్రియుల అంచనాలు అంబరాన్ని తాకాయి. ఈ ‘షో’కు ప్రత్యేక ఆకర్సణగా నిలిచిన సామ్‌సంగ్ రెండు ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వేదిక పై ఆవిష్కరించనుందని సామ్ మొబైల్స్ పేర్కొంది. గెలాక్సీ ఫ్రేమ్, గెలాక్సీ యంగ్ డ్యుయోస్ మోడళ్లలో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్‌లలో రెండవది సింగిల్ సిమ్ వర్సన్. ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సైట్ వెల్లడించిన వివరాలు మేరకు ‘గెలాక్సీ ఫ్రేమ్’ మార్చి 2013 నుంచి మార్కెట్లో లభ్యంకానుంది. గెలాక్సీ యంగ్ డ్యయోస్ ఫిబ్రవరి చివరి నుంచి అందుబాటులోకి రానుంది.

మోడల్ నంబర్స్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్ (జీటీ-ఎస్6810).

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ డ్యుయోస్ (జీటీ- ఎస్6312).

టాప్-10 ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన డిస్‌ప్లేతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4..?

సామ్‌సంగ్ కొత్త జనరేషన్ ఫోన్ ‘గెలాక్సీ ఎస్4’ పై భారీ అంచనాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో రూమర్లు అభిమానాల ఆశలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ ఆధునిక వర్షన్ ఫోన్‌ను ఏప్రిల్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా నివేదికులు పేర్కొంటున్నాయి. ఈ ఫ్లాగ్ షిప్ డివైజ్‌లో ఏర్పాటు చేసిన శక్తివంతమైన డిస్‌ప్లేను పాలిమర్ వ్యవస్థ ఆధారంగా రూపొందించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఏదేమైనప్పటికి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే సామ్‌సంగ్ వర్గాలు గెలాక్సీ ఎస్4 పై పెదవి విప్పాల్సిందే.

పలు నివేదికలు ఆధారంగా సేకరించిన గెలాక్సీ ఎస్4 ఫీచర్లు (ఊహాజనితంగా):

5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,

441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X