అత్యంత షార్ప్ ఫోన్.. ధర రూ. 40,500

Written By:

ఇప్పుడిప్పుడే ఆండ్రాయిడ్ మార్కెట్లో సత్తా చాటుతున్న జపాన్ దిగ్గజం షార్ప్ తన సరికొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. షార్ప్‌ ఎక్స్‌1 పేరుతో రెండవ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్వదేశంలో ప్రారంభించింది. దీని ధరను సుమారు రూ.40,500గా నిర్ణయించింది. ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్లతో పోల్చితే ఖరీదైన ఫోన్‌గా షార్ప్‌ ఎక్స్‌1 నిలిచింది.

షియోమి కొత్త ఫోన్, దుమ్మురేపుతున్న ఫీచర్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ తోపాటు డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

మూడు గంటల్లోపే పూర్తిగా చార్జ్‌

అంతే కాకుండా మూడు గంటల్లోపే పూర్తిగా చార్జ్‌ అవుతుందనీ, సింగిల్‌ చార్జ్‌తో నాలుగు రోజులు పని చేస్తుందని కంపెనీ ప్రధానంగా చెబుతోంది.

డిస్‌ ప్లే

ఫీచర్ల విషయానికొస్తే 5.3-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ ప్లేతో పాటు 1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్‌ ఉంది.

ఆండ్రాయిడ్‌ 7.1 నౌగట్‌

ఆండ్రాయిడ్‌ 7.1 నౌగట్‌ మీద రన్ అయ్యే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435తో ఆపరేట్ అవుతుంది.

ర్యామ్‌, కెమెరా

3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మొమరీ, 16.4-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా, 3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యం (విత్‌ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌) ప్రధాన ఫీచర్లు

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sharp X1 Android One Phone With 3900mAh Battery Launched: Price, Specifications read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot