4 జిబి ర్యామ్‌తో సచిన్ ఫోన్ , ధర ఎంతంటే..

Written By:

దేశీయ టెక్నాలజీ సంస్థ, ఐవోటీ స్టార్టప్‌ కంపెనీ స్మార్ట్రాన్ రూపొందించిన కెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ srt దేశంలో నేడు లాంచ్‌ అయింది. ఏ బిలియ‌న్ డ్రీమ్స్ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన టెండూల్కర్‌ ఇప్పుడు ఈ మొబైల్ ద్వారా ఫోన్ల రంగంలోకి రానున్నారు. ఇన్‌స్పైర్డ్‌ బై జీనియస్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్లు యూజర్లను ఆకట్టుకోనున్నాయి. రిమో ఎస్ఆర్‌టీ ప్రాజెక్టు కింద ఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో సచిన్‌ దీన్ని లాంచ్‌ చేశారు.

జియో నుంచి ఈ ఏడాది రానున్న మెరుపులు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌ సిస్టం

ఎస్ఆర్‌టీ (స‌చిన్ ర‌మేశ్ టెండుల్కర్‌‌) ఫోన్ అని పేరు పెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌ సిస్టం ఆధారంగా ప‌ని చేస్తుంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌లో టెండూల్కర్‌ స్ట్రాట‌జిక్ పార్టనర్‌ కావ‌డం విశేషం. ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ అమ్మకాలు జరపనుంది. డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.

ధ‌ర రూ. 12,999వేల రూపాయ‌లుగా ఉండే అవకాశం

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ తోపాటుఆ ప్రతి ఫోన్ బ్యాక్ క‌వ‌ర్‌పై టెండూల్కర్‌ ఆటోగ్రాఫ్‌తో వ‌స్తుండ‌డం మ‌రో స్పెషాలిటీ. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర 32 జిబి వేరియంట్ రూ. 12,999వేల రూపాయ‌లుగా, 64 జిబి వేరియంట్ ధర రూ. 13,999గా నిర్ణయించారు.టైటానియం గ్రే కలర్ లో ఫోన్ లభ్యమవుతోంది. 

మే 1న టూ డేస్‌ టూ గో

కాగా దీనికి సంబంధించి ట్విట్టర్‌ లో పోస్ట్ చేసిన వీడియో ఫోన్ లవర్స్‌ను తెగ ఊరిస్తోంది. మే 1న టూ డేస్‌ టూ గో ఒక చిన్నవీడియోను పోస్ట్‌ చేశారు. కాగా క్రికెట్ లెజండ్‌గా స‌చిన్‌కు ఉన్న క్రేజ్ ఈ ఫోన్‌కు మంచి ఎసెట్ అవుతుంద‌న్నది మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎస్ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

ఎస్ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి. 5.5 ఇంచెస్ ఎమౌల్డ్ కెపాసిటివ్ ట‌చ్ స్క్రీన్‌ తో పాటు ఆండ్రాయిడ్ నౌగ‌ట్ 7.0 ఓఎస్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 810 ఎస్‌వోసీ చిప్‌సెట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

4 జీబీ ర్యామ్‌

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్నల్‌ మెమ‌రీ, 13 ఎంపీ రియ‌ర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్‌, ఆటోఫోక‌స్‌, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ప్రధాన ఆకర్షణలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartron, Sachin Tendulkar to Launch srt.phone Smartphone in India Today read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting