షాక్..ఆ ఫోన్లపై ఏకంగా రూ. 10 వేలు తగ్గింపు

Written By:

దిగ్గజ టెక్ మొబైల్ కంపెనీ సోనీ తన స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ని ప్రకటించింది. సోనీ నుంచి వచ్చిన ఎక్స్, జెడ్ 5 ప్రీమియం ధరలను ఏకంగా 21 శాతం వరకు తగ్గింపు నిచ్చింది. ఈ తగ్గిన ధరలు సెప్టెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. సోనీ ఎక్స్పిరియా ఎక్స్ ధర మొదట్లో రూ. 48.990 ఉండగా, ఇప్పుడు రూ. 10 వేలు తగ్గి రూ. 38.990 కి చేరుకుంది. అదేవిధంగా ఎక్స్పిరియా జెడ్5 ప్రీమియం ధర రూ. 55.990 కాగా, దీని ధరలో 14 శాతం కోతపెట్టింది. దీంతో ఎనిమిది వేలు తగ్గి రూ. 47.990 కే ఇది లభిస్తోంది. భారీ తగ్గింపు పొందిన ఆ ఫోన్ ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

256జిబి స్టోరేజితో ఐ ఫోన్ 7, 7ప్లస్..రేపే విడుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

టచ్ స్క్రీన్ తో వచ్చిన ఈ ఫోన్ 5 ఇంచ్ డిస్ ప్లేతో దూసుకొస్తోంది.డిమెన్సన్ 142.70 x 69.40 x 7.90గా ఉంది. రిజల్యూషన్ విషయానికొస్తే 1080x1920 pixelsగా ఉంది.

#2

బ్యాటరీ విషయానికొస్తే 2620 సామర్ధ్యంతో ఉంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ. మొబైల్ బరువు 153 గ్రాములు. నానోసిమ్ తో వచ్చిన ఈ ఫోన్ 3జీ,అలాగే 4జీని సపోర్ట్ చేస్తుంది.

#3

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ తో వచ్చిన ఈ ఫోన్ లో 3జిబి ర్యామ్ తో పాటు 32 జిబి స్టోరేజి ఉంది. దీంతో పాటు మైక్రో ఎస్ డీ కార్డుతో 2000 జిబి వరకు మొమొరీ సామర్థ్యాన్ని విస్తరించుకోవచ్చు.

#4

కెమెరా విషయానికొస్తే 23 మెగా ఫిక్సల్ కెమెరాతో దూసుకొచ్చింది. ఫ్లాష్ లైట్ తో 13 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా తో అదిరిపోయో ఫోటోలను తీసుకోవచ్చు.

#5

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లోని ఈ ఫోన్ లో పొందుపరిచారు. వైఫై, 4.20 బ్లూటూత్, యుఎస్ బి తో పాటు 3.5 ఎమ్ ఎమ్ హెడ్ ఫోన్స్ ,ఎఫ్ఎమ్ ప్రత్యేక ఆకర్షణలు

#6

మొత్తం నాలుగు రకాల రంగుల్లో White, Graphite Black, Lime Gold, Rose Gold వేరియంట్లలో లభిస్తోంది. దీని ధర రూ. 48.990. రూ. 10 వేలు తగ్గి రూ. 38.990 వద్ద ఫోన్ లభిస్తోంది.

#7

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

గ్లాస్ ఇంకా మెటల్ కలయకతో కూడిన సోనీ ఐకానిక్ వోమ్నిబ్యాలన్స్ డిజైన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది.

#8

4కే క్వాలిటీ అల్ట్రా హై రిసల్యూషన్ డిస్‌ప్లే,64 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 సాక్

#9

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

#10

23 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ప్రత్యేకతలు: హైబ్రీడ్ ఆటో ఫోకస్ కెమెరా, 1/2.3 అంగుళాల ఎక్స్ మార్ ఆర్ఎస్ సీఎమ్ఓఎస్ సెన్సార్, జీ-లెన్స్, 24 ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, బయోంజ్ ఇంటెలిజెంట్ ఇమేజింగ్ ప్రాసెసింగ్), 5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

#11

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వాటర్ ఇంకా డస్ట్ ప్రూ,ఫ్అద్భుతమైన సౌండ్ క్వాలిటీ.

#12

కొనుగోలు కోసం అలాగే మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Sony slashes prices of Xperia X, Z5 Premium by up to Rs. 10,000
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot