కొత్త ఫోన్.. కంటిచూపుతో అన్‌లాక్

Written By:

చైనా మార్కెట్లో అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారు అయిన టీసీఎల్ కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టీసీఎల్ 560 పేరుతో రిలీజయిన ఈ ఫోన్ 170 దేశాల్లో అమ్మకాల పరంపర కొనసాగిస్తోంది. ఐ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫీచర్ తో వచ్చిన ఈ ఫోన్ కంటిని చూపిస్తే ..ఫోన్ మూడుసెకన్లలో అన్‌లాక్‌ అవుతుంది.ఈ సదుపాయం ద్వారా గుర్తుతెలియని వారు అన్ లాక్ చేయడం సాధ్యంకాదని కంపెనీ చెబుతోంది. మొబైల్ పరిశ్రమలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కంటే బయోమెట్రిక్ ధ్రువీకరణ సాంకేతికతను సురక్షితమైనదిగా ఇప్పుడు పరిగణించబడుతోంది.ఈ నేపధ్యంలో ఈ ఫోన్ ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్ (లేటెస్ట్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టీసీఎల్ 560 ఫీచర్స్

5.5 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సెల్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

టీసీఎల్ 560 ఫీచర్స్

ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్‌ సిస్టం, డబుల్ సిమ్‌ 1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌

టీసీఎల్ 560 ఫీచర్స్

2జీబీ ర్యామ్‌, 16జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128జీబీ ఎక్స్‌పాండ‌బుల్ మెమొరీ

టీసీఎల్ 560 ఫీచర్స్

8 మెగా పిక్సెల్‌ రియర్ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా

టీసీఎల్ 560 ఫీచర్స్

2500 ఎంఏహెచ్‌ బ్యాంటరీ,4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, కొత్తగా వాల్సూమ్ బటన్ పైన పవర్ బటన్ అమర్చారు.

టీసీఎల్ 560 ఫీచర్స్

డార్క్ గ్రే, మెటాలిక్ గోల్డ్ కలర్స్ లో లభిస్తున్న ఈ ఫోన్ ధర రూ. 7,999.

టీసీఎల్ 560 ఫీచర్స్

అమెజాన్‌లో మాత్రమే ఫోన్ అందుబాటులో ఉంది. అయితే ఫోన్ ప్రతీసారి కంటిని ఉపయోగించి అన్ లాక్ చేయడం కొంచెం కష్టమైన పనే..మరి సౌకర్యవంతంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.

 

 

కొత్త ఫోన్.. కంటిచూపుతో ఆన్‌లాక్

రెడిమీ 2 ప్రైమ్ అలాగే లెనోవా వైబ్ కె5 ప్లస్ కు ధీటుగా ఈ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write tcl 560 smartphone with iris scanner goes official india at rs 7999
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot