ఐఫోన్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోందా..?

Written By:

ఐ ఫోన్ ప్రపంచ మార్కెట్లో నిన్నటి వరకు రారాజు..కంపెనీ నుంచి వచ్చిన ఏ ఫోన్ అయినా సరే మార్కెట్లో సంచలనాలు నమోదు చేయాల్సిందే. ఈ ఫోన్‌కున్న బ్రాండ్ మరే ఫోన్‌కు లేదు.. ఇంకా చెప్పాలంటే ఫోన్ మీద పిచ్చితో కీడ్నిలు అమ్ముకున్నవాళ్లు ఉన్నారు. అలాగే పిల్లల్ని అమ్ముకున్న వాళ్లని పేపర్లలో టీవిల్లో చూశాం..ది ఒకప్పుడు కాని ఇప్పుడు ఆపిల్ ఐ ఫోన్‌కు కష్ట కాలం మొదలయ్యింది. మునుపెన్నడూ లేనతంగా ఆపిల్ నుంచి వచ్చిన ఐ ఫోన్ ఎస్ఈ అమ్మకాలు పడిపోయాయి. ఆపిల్ నుంచి వచ్చిన ఏ ఫోన్ కూడా ఇంత తక్కువ అమ్మకాలు చేయలేదు.

Read more : ఐఫోన్ 7 కొత్త లుక్ అదిరింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

తాజాగా విడుదల చేసిన ఐఫోన్ ఎస్ఈ మోడల్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. గతవారం ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలు మొత్తం ఐఫోన్ మోడల్ ఫోన్లలో 0.1 శాతం మాత్రమేనని లోకలిస్టిక్ సర్వేలు వెల్లడించాయి.

2

ఐఫోన్ ఎస్ఈని 399 డాలర్లతో (రూ.26,557) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాని ఆ ఫోన్ విడుదలైనప్పటి నుంచి ఐఫోన్ అమ్మకాలు ఏ మాత్రం పెరగలేదు. ఈ ఫోన్ గురంచి కొన్ని నమ్మలేని నిజాలు బయటకు రావడంతో అమ్మకాలు పడిపోయాయని అదీ కూడా ఓ కారణం కావచ్చని తెలుస్తోంది.

3

ఐఫోన్ 7ఎస్ మోడల్ విడుదల చేసినా కూడా అది ఈ ఫోన్ అమ్మకాలను పెద్దగా కాపాడగలిగే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇంకా దీని ప్రభావం రానున్న ఐ ఫోన్ పై పడే అవకాశం ఉందని దాని అమ్మకాలు కూడా ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటనే భయం కూడా ఇప్పుడు మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది.

4

దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ కొనడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని, ఐఫోన్ కు పెట్టే ఖర్చు కంటే తక్కువ ఖర్చుకి మంచి ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ ఫోన్స్ మార్కెట్ లో ఉండడం ఐఫోన్ కు పెద్ద దెబ్బ తగలనుందని సర్వేలు తెలుపుతున్నాయి.

5

ఐ ఫోన్ ఎస్ఈ రాకతో ఆపిల్ ఫోన్లు రేట్లు గణనీయంగా తగ్గుతాయని భావించినా అదేమి జరగలేదు. పైగా ఈ ఫోన్ తయారీఖర్చు 10 వేలు కాని అమ్మేది మాత్రం 40 వేలు అంటూ ఈ మధ్య వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం కూడా అమ్మకాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

6

పాత మోడళ్లకు కొన్ని లేటెస్ట్ ఫీచర్లను కలిపిన యాపిల్, ఐఫోన్ ఎస్ఈని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాని ఆ ఫోన్ విడుదలైనప్పటి నుంచి ఐఫోన్ అమ్మకాలు ఏ మాత్రం పెరగలేదు.

7

ఐ ఫోన్ 7 సెప్టెంబర్ లో మార్కెట్లోకి రానుంది. రానున్న కొత్త ఫోన్ లో కొన్ని ప్రత్యేకతలను జోడించి మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ధర ఎంతో చెప్పకపోయినా కాని రానున్న ఐ ఫోన్ భారీ స్థాయిలోనే ఉండొచ్చనే తెలుస్తోంది.

8

మరి ఇంత ఖర్చు పెట్టి ఆ ఫోన్ కొంటారా అన్నదే ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. ఒకవేళ ఐ ఫోన్ అభిమానులు కొన్నా మార్కెట్లో నిలవాలంటే ఆ ఫోన్ అమ్మకాలు గణనీయంగా పెంచుకోవాల్సి ఉంటుంది.

9

శ్యాం సంగ్ అలాగే ఎల్ జీ, ఇంకా మోటోరోలా ,చైనా కంపెనీల ఫోన్లు తక్కువ ధరలకు అత్యధిక ఫీచర్లను అందిస్తూ మార్కెట్ లో దూసుకుపోతున్నాయి. వాటిని తట్టుకుని రానున్న ఐ ఫోన్ 7 ఏ మేరకు నిలబడగలదనేది ముందు ముందు చూడాలి.

10

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేపి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The iPhone SE disappoints in opening weekend sales
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot