తక్కువ డేటా ప్లాన్‌తో ఎక్కువ ఇంటర్నెట్‌ను పొందటం ఏలా..?

Posted By:

మనలో చాలా మంది రకరకాల డేటా ప్లాన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను వినియోగిస్తుంటాం. ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలన్స్ ఉందంటే చాటింగ్, బ్రౌజింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ ఇలా అనేక రకాల కార్యకలాపాలకు పాల్పడుతుంటాం. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకంటూ ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు పలు తీరైన మార్గాలను ఇప్పుడు చూద్దాం..

(ఇంకా చదవండి: ఆండ్రాయిడ్ వాచ్‌కే సొంతమైన 6 ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు!!)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత వై-ఫై డేటాను వినియోగంచుకోవటం వల్ల

మొబైల్ డేటాకు బదులుగా ఉచిత వై-ఫై డేటాను వినియోగంచుకోవటం వల్ల ఇంటర్నెట్ డేటాను ఆదా చేసుకోవచ్చు. మీ ఫోన్ లో వై-ఫై పైండర్ ను ఇన్ స్టాల్ చేసుకోవటం ద్వారా ప్రయాణంలో ఉన్నపుడు ఉచిత వై-ఫై స్పాట్‌లను వెతుక్కోవటం చాలా సులభతరమవుతుంది.

తక్కువ కేబీ సైజుతో కూడిన ఫోటోలు, వీడియోలు

తక్కువ కేబీ సైజుతో కూడిన ఫోటోలను సోషల్ నెట్‌వర్కింగ్ వైబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేయటం ద్వారా ఎక్కువ ఇంటర్నెట్ ఖర్చు అవుతుంది. కాబట్టి తక్కువ కేబీ సైజుతో కూడిన ఫోటోలు, వీడియోలను మాత్రమే ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయండి.

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ అలవాట్లను తగ్గించుకోండి

తరచూ ఇంటర్నెట్‌లోకి వెళ్లి మ్యూజిక్ ఇంకా సినిమాలను స్ట్ర్రీమ్ చేస్తున్నట్లయితే బోలెడంత ఇంటర్నెట్ డేటా ఖర్చై పోతుంది. కాబట్టి ఇంటర్నెట్ డేటాను ఆదా చేసుకునే క్రమంలో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ అలవాట్లను తగ్గించుకోండి.

వీడియో చాట్‌లను తగ్గించుకోవటం ద్వారా

ఇంటర్నెట్ వీడియో చాట్‌లను తగ్గించుకోవటం ద్వారా డేటా వినియోగాన్ని అదుపులోకి తీసుకురావచ్చు.

ఆన్‌లైన్ వీడియో గేమ్స్ కు బదలుగా ఆఫ్‌లైన్ వీడియోగేమ్స్

ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమింగ్‌కు బదులు ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్‌కు ప్రాధాన్యతనివ్వండి.

ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను

మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.

అవసరంలేనపుడు 3జీ, 4జీ కనెక్షన్‌లను టర్నాఫ్ చేయండి

అవసరంలేనపుడు 3జీ, 4జీ కనెక్షన్‌లను టర్నాఫ్ చేయండి. ఇలా చేయటం వల్ల డేటాను పొదుపుగా వాడుకోవచ్చు. ఇలా చేయాలంటే settings>Wireless &Networks>More>Mobile Networks>Data Connection

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These 6 simple steps will lower your smartphone data consumption. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot