ఆండ్రాయిడ్ వాచ్‌కే సొంతమైన 6 ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు!!

Posted By:

స్మార్ట్‌‌వాచ్‌ల విభాగంలో యాపిల్, గూగుల్ మధ్య అగ్గి రాజుకుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లో లభ్యమవుతుండటంతో పోటీ రసవత్తరంగా కొనసాగుతోంది. అ రెండు వేరువేరు ప్లాట్‌ఫామ్‌ల పై స్పందించే ఈ వాచ్‌లు నువ్వా-నేనా అన్నట్టుగా పోటాపోటీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టం పై స్సందించే స్మార్ట్‌వాచ్‌లకు సంబంధించి గూగుల్ తాజాగా ఆండ్రాయిడ్ వేర్ 5.1.1 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ పోటీని తట్టుకునే క్రమంలో యాపిల్ తన వాచ్‌కు సంబంధించి మరిన్ని అప్‌డేట్‌లను విడుదల చేయవల్సి ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌కే సొంతమైన 6 ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

(ఇంకా చదవండి: ఇక ఒకే సిమ్‌తో 9 నెంబర్లు..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌ రకరకాల ఫేస్ డిజైన్‌లలో లభ్యమవుతోంది. ఇందుకు కారణం ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌‌కు సంబంధించి రకరకాల ఫేస్‌లను డిజైన్ చేసేందుకు గూగుల్ ఇప్పటికే డెవలపర్లకు అనుమతిని మంజూరు చేసింది. యాపిల్ వాచ్ కేవలం 11 ఫేస్ డిజైన్‌లలో మాత్రమే లభ్యమవుతోంది.

ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లలో క్లాక్ మోడ్ ఎల్లప్పుడు ఆన్ లోనే ఉంటుంది. 

ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లు అన్ని రకాల వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి.

ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లకు అందిన తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా ఎమోజీలను చేతితోనే గీయవచ్చు.

ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లకు అందిన తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా మనికట్టు సంజ్ఞలతో వాచ్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. 

ప్రత్యేకమైన లాక్ వ్యవస్థ ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 things Android Wear smartwatches can do that the Apple Watch can't. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot