మార్కెట్లోకి దూసుకొచ్చిన కొత్త ఫోన్లు..

Written By:

దేశీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లోకి కొత్తగా మూడు ఫోన్లు దూసుకొచ్చాయి. సరికొత్త ఫీచర్లతో ఇండియా మార్కెట్ ని షేక్ చేసేందుకు ఈ ఫోన్లు రెడీ అయ్యాయి. అమెరికాకు చెందిన ఇన్‌ఫోకస్‌ 'టర్బో5', చైనాకు చెందిన లీఫోన్‌ 'లీఫోన్‌ డబ్ల్యు2', నుబియా 'ఎన్‌2' ఫోన్లను విడుదల చేశాయి. వీటి ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఐఫోన్ 8 ఈ రేంజ్‌లో వస్తోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీఫోన్‌ డబ్ల్యు2:

ఈ ఫోన్‌ రెండు 4జి సిమ్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. 1.3 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1జిబి రామ్‌, 8జిబి ఇంటర్నల్‌ మెమరీ (మైక్రో ఎస్‌డి కార్డుతో 32 జిబిలకు పెంచుకోవచ్చు), 2 ఎంపి వెనుక కెమెరా, ముందు భాగంలో విజిఎ కెమెరా, ఆండ్రాయిడ్‌ మార్ష్‌మల్లో ఔస్‌, 4.5 అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలకు ఈ మొబైల్‌ సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర 3,999 రూపాయలు.

టర్బో 5:

4జి సర్వీసులకు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 5.2 అంగుళాల హెచ్‌డి ఐపిఎస్‌ 2.5డి గ్లాస్‌ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ ఔస్‌, 13 ఎంపి వెనుక కెమెరా, 5 ఎంపి సెల్ఫీ కెమెరా, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. 2జిబి రామ్‌ 16జిబి ఇంటర్నల్‌ మెమరీ ఉన్న ఫోన్‌ ధర 6,999 రూపాయలుండగా.. 3జి రామ్‌ 32 జిబి ఇంటర్నల్‌ మెమరీ ఉన్న ఫోన్‌ ధర 7,999 రూపాయలుగా ఉంది.

ఎన్‌2:

ప్రీమియం సెగ్మెంట్లో అందుబాటులోకి వచ్చిన ఫోన్‌ ఇది. ఇందులో 5.5 అంగుళాల హెచ్‌డి అమోఎల్‌ఇడి డిస్‌ప్లే, 4జిబి రామ్‌, 64 జిబి ఇంటర్నల్‌ మెమరీ, 13 ఎంపి వెనుక కెమెరా, 16 ఎంపి ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ మార్ష్‌మల్లో ఔస్‌, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఎంటికె ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌ ధర 15,999 రూపాయలు. ఇది అమెజాన్‌ డాట్‌ ఇన్‌లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.

శాంసంగ్ నుంచి J5 Pro

3జిబి ర్యామ్‌తో శాంసంగ్ నుంచి J5 Pro. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

రూ. 500కే 4జీ వోల్ట్ ఫోన్ , ఈ నెలలోనే !

రూ. 500కే 4జీ వోల్ట్ ఫోన్ , ఈ నెలలోనే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Three New Smart Phones To Enter The Indian Market Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot