సెల్ఫీ లవర్స్ కోసం టాప్ టెన్ సెల్ఫీ ఫోన్లు

Written By:

ఈ రోజుల్లో చాలామంది సెల్పీలు సెల్పీలు అని కలవరిస్తుంటారు. రొజుకొక సెల్ఫీ తీసుకోనిదే ఎవరికీ నిద్ర కూడా పట్టదంటే అతిశయోక్తి కాదేమో..అయితే అటువంటి వారికోసమే మార్కెట్లోకి అదిరిపోయే సెల్పీలతో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. మరి వాటిల్లో అత్యుత్తమ సెల్ఫీల ఫోన్లు ఎంటి..ఏ స్మార్ట్ ఫోన్లు సెల్ఫీలను బాగా తీస్తాయి అనే దానిపై ఓ 10 ఫోన్లు మీకు పరిచయం చేస్తున్నాం వాటిపై ఓ లుక్కేయండి.

Read more: 2015లో అత్యంత చెత్త సెల్ఫీ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ ఏ 350, ధర ( రూ. 18,710 )

మైక్రోమ్యాక్స్ నుంచి దూసుకొస్తున్న ఫోన్ ఇది. ఆక్టా కోర్ ప్రాసెసర్ తో 2జిబి ర్యాంతో అదిరిపోయే విధంగా ఉంటుంది. 5.0 పుల్ డిస్ ప్లే తో పుల్ హెచ్ డి డిస్ ప్లే తో రన్ అవుతుంది. 16 ఎంపీ ప్రైమరీ కెమెరా అలాగూ 5ఎంపీ సెల్ఫీ కెమెరా అదిరిపోయే సెల్ఫీలు తీసుకోవచ్చు. అతి తక్కువలో గ్రేట్ ఫెర్పార్మెన్స్ గత ఫోన్ ఇది.

హెచ్ టీసీ వన్ ఎమ్ 8 , ధర ( రూ. 34,694)

ఫ్లాగ్ షిప్ ఫోన్ ఈ ఎమ్ 8 ఫోన్ .వెరీ స్టయిలిష్ గా ఉంటుంది. పుల్ హెచ్ డి డిస్ ప్లేతో వీడియోని చూడవచ్చు. ఈ ఫోన్ లో ఉన్న అదిరిపోయే ఫెసిలిటీ సెల్ఫీ కెమెరా..5 మెగా ఫిక్షల్ కెమెరాతో హెచ్ డిఆర్ లెవల్ సెల్ఫీలు తీసుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే కెమెరా కోసమే ఈ ఫోన్ తీసుకోవచ్చు.

శ్యాం సంగ్ గెలాక్సీ ఈ7 ,ధర ( రూ. 20,599)

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆండ్రాయిడ్ పోన్లలో ఈ గెలాక్సీ ఈ 7 ఒకటి.5.5 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లేతో హెచ్ డి రిజల్యూషన్ కలిగి ఉంటుంది. చూసేదానికి అదిరిపోయే లుక్ తో చాలా స్టయిలిష్ గా ఉంటుంది. 1.2 జిగా క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో 2 జీబి ర్యామ్ కలిగి ఉంటుంది. చాలా స్మూత్ గా రన్ అవుతుంది ఈ ఫోన్. గేమ్స్ ఆడేవారికి గ్రాపిక్స్ బాగుంటాయి. 13 ఎంపీ కెమెరా అలాగే 5 ఎంపీ సెల్ఫీ కెమెరా..వీడియో కాల్స్ లో సెల్ఫీ చాలా బాగా కనిపిస్తుంది.

సోనీ ఎక్స్ పీరియా సీ3, ధర (రూ. 19595)

ఈ ఫోన్ తో కూడా అద్భుతంగా ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే షేరింగ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న అత్యంత విలువైన స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటి. హెచ్ డి డిస్ ప్లేతో వీడియోలను చూడవచ్చు. 4.7 ఇంచ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్ 2500mAh బ్యాటరీ ఫెర్పాపర్మెన్స్ చాలా బాగుంటుంది. 5ఎంపీ సెల్ఫీ కెమెరాతో మీ గ్రేట్ మూమెంట్స్ ని క్లిక్ చేసుకోవచ్చు.

జియోని ఈలైప్ ఎస్5.1, ధర (రూ. 17,141)

స్టన్నింగ్ ఫెర్మాఫర్మెన్స్ తో జియోని విడుదల చేసిన ఫోన్ ఇది. 4.8డిస్ ప్లేతో హెచ్ డి రిజల్యూషన్ కలిగి ఉంటుంది. 1.7 GHz ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి 2 జీబి ర్యామ్ తో మంచి లుక్ కలిగి ఉన్న ఫోన్ ఇది. గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది. ఇక కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ కెమెరాతో స్టయిలిష్ గా ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో మంచి సెల్ఫీలు తీసుకోవచ్చు.

కార్బూన్ టైటానియం ఆక్టోన్ ప్లస్ ,ధర ( రూ. 11,045)

ఇండియన్ మార్కెట్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న కార్బూన్ నుంచి వచ్చిన ఫోన్ ఇది. స్మార్ట్ ఫోన్ లలో మోర్ ఇంప్రెసివ్ కలిగిన ఫోన్ ఇది. 5 ఇంచ్ హెచ్ డిస్ ప్లేతో 1.7GHz ఆక్టాకోర్ ప్రాసెపర్ ను కలిగి ఉంటుంది. 13 ఎంపీ కెమెరాను కలిగి 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో మంచి లుక్ కలిగి ఉంటుంది. సెల్ఫీలు తీసుకోడానికి ఈ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్ గా అతి తక్కువ ధరలో అత్యంత మన్నికైన ఫోన్ లలో దీన్ని కూడా చేర్చవచ్చు.

జియోని ఈలైప్ ఈ 7 మిని, ధర (రూ. 15890)

అమేజింగ్ ఫోటాగ్రాఫ్ లను తీసుకోవాలనుకుంటున్నారా..అయితే జియోని నుంచి వచ్చిన ఈ ఫోన్ తో మీరు అటువంటి ఫోటోలను తీసుకోవచ్చు. 13 ఎంపీ రొటేట్ కెమెరాతో అదిరిపోయే ఫోటోలను తీసుకోవచ్చు. 4.7 ఇంచ్ డిస్ ప్లే. ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. లుకింగ్ చాలా స్మార్ట్ గా అందంగా తయారయి ఉంటుంది.

ఒప్పో ఎన్ 1, ధర (రూ. 32,990)

గూగుల్ యాప్స్ ఈ ఫోన్ లో బావుంటాయి. గూగుల్ మ్యాప్స్ అలాగే ప్లే స్టోర్స్ వర్కింగ్ చాలా గుడ్. 13 ఎంపీ కెమెరా గ్రేట్ క్వాలిటీతో సెల్ఫీలు అలాగే వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ వచ్చిందే అదిరిపోయే కెమెరాతో.

శ్యాంసంగ్ గెలాక్సీ నోట్ 4, ధర ( 55,739)

శ్యాం సంగ్ నుంచి వచ్చిన మరో క్వాలిటీ ఫోన్ ఇది. డిజైనింగ్ తో పాటు ఫీచర్స్ కూడా చాలా బావుంటాయి. 2.7 GHz ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 5.7 ఇంచ్ సూపర్ అమోల్డ్ స్క్రీన్ కలిగి అదిరిపోయే లుక్ తో దర్శనమిస్తుంది. 3 జిబి ర్యామ్. 16 ఎంపీ రేర్ కెమెరాను కలిగి 3.7 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలను తీసుకోవచ్చు.

ఆపిల్ ఐ ఫోన్ 6 ఐ ఫోన్ 6 ఫ్లస్ , ధర ( 48,575)

అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఐ ఫోన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్ లు చాలా సేఫైన ఫోన్లు. ఇక పై ఫోన్లను పరిశీలిస్తే 8 ఎంపీ ప్రైమరీ కెమెరా అలాగే 1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉన్నాయి. అయినా గ్రేట్ చిత్రాలను మనం తీసుకోవచ్చు. సెల్ఫీలు తీసుకోవాలంటే ఐ ఫోన్ తరువాతనే మిగతా ఫోన్లు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10 Mobile Phones for Selfie Lovers in year 2016
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot