ఫ్లాష్ సేల్స్‌లో హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ఊరించే ఫీచర్లు..పాకెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లు.. ఎక్స్‌క్లూజివ్ ఫ్లాష్‌సేల్‌లు.. ఆన్‌లైన్ విక్రయాలు, ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమ ఫోన్‌లను తెలివిగా మార్కెట్ చేసుకునేందుకు ఫోన్ తయారీ కంపెనీలు అనుసరిస్తున్న నయా ట్రెండ్ ఇది. భారత్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌సేల్ సంస్కృతిని షియోమీ పరిచయం చేసింది. ఆ తరువాత షియోమీతో పాటు మైక్రోమాక్స్, మోటరోలా, లెనోవో, హవాయి, వన్ ప్లస్ వంటి కంపెనీలు తమ స్మార్ట్‌‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లాష్ సేల్ రూపంలో విక్రయిస్తున్నాయి. ఫ్లాష్ సేల్‌ వ్యూహాన్ని అనుసరిస్తూ ఆన్‌లైన్ మార్కెట్లో హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

(ఇంకా చదవండి: షియోమీ ఎంఐ4ఐ vs మైక్రోమాక్స్ యు యురేకా vs లెనోవో ఏ7000)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ ఎంఐ 4ఐ

షియోమీ ఎంఐ 4ఐ

షియోమీ ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

 

మెక్రోమాక్స్ యు యురేకా

మెక్రోమాక్స్ యు యురేకా
కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్8939 ఆక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల FWVGA టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో ఏ7000

లెనోవో ఏ7000
ధర రూ.8,999

కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

 

లెనోవో ఏ6000ప్లస్

లెనోవో ఏ6000ప్లస్
ధర రూ.7,499

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ 2.0 యూజర్ ఇంటర్ ఫేస్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ మైక్రో సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై ఇంకా బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 5 Hot Selling Smartphones Available in India on Flash Sale. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot